Begin typing your search above and press return to search.
30 ఇయర్స్ గయ్.. వాటే లక్కీ ఫెలో
By: Tupaki Desk | 18 Nov 2015 1:30 AM GMTఇప్పుడు దాదాపు ప్రతీ హిట్టు సినిమాలోనూ ప్రతీ ఫ్లాపు సినిమాలోనూ ఏదో ఒక క్యారెక్టర్ చేస్తూ కనిపిస్తున్న నటుడు ఎవరన్నా ఉన్నారా అంటే.. ఓ నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. యూత్ లో సప్తగిరి - వెన్నెల కిషోర్ - శకలక శంకర్.. అలాగే సీనియర్లలో 30 ఇయర్స్ పృథ్వీ. వీరందరూ రోజూ షూటింగులతో ఫుల్ బిజీ. ఇండియాలోనే కాదు.. ఓవర్ సీస్ లో కూడా ఈ నటులను తీసుకెళ్లి మరీ షూటింగులు చేస్తున్నారు మన దర్శక దిగ్గజాలు.
వీళ్ళందరిలోకి కాస్త లేటుగా ఫామ్ లోకి వచ్చిన యాక్టర్ ఎవరంటే.. పృథ్వీ అనే చెప్పాలి. ఎప్పుడో ఖడ్గం సినిమాతో బ్రేకొచ్చినా కూడా.. ఇప్పటివరకు ఇంకా చిన్నాచితకా క్యారెక్టర్లతోనే సరిపెట్టుకుంటున్నాడు. కాని లాస్ట్ ఇయర్ లౌక్యం సినిమాలో బాయిలింగ్ స్టార్ బబ్లూ క్యారెక్టర్ హిట్టవ్వడంతో ఫేట్ ఎక్కడికో తిరిగింది. అయితే అంతకంటే పెద్ద బూస్టు ఇప్పుడు ఇంకోటొచ్చిందట.
ఈ మధ్యన సీనియర్ కమెడియన్ బ్రహ్మానందంకు రీప్లేస్ మెంట్ ఎవరబ్బా అని ఆలోచిస్తున్న ప్రతి దర్శకుడూ.. పృథ్వీ పైనే కన్నేస్తున్నారట. దానికితోడు బాలయ్య డిక్టేటర్ లో కూడా మనోడు ఒక అదిరిపోయే రోల్ చేశాడట. దాని గురించి చర్చించుకుంటూ అందరూ బ్రహ్మీకి ఆల్టరనేటివ్ మనోడే అంటున్నారు. మొన్నటివరకు ఎం.ఎస్.నారాయణ బ్రహ్మీ లేకపోయినా కూడా సినిమాను తన భుజాలపై వేస్కొనే వారు.. కాని ఆయన లేని ఈ సమయంలో కమెడియన్ల లోటు కనిపిస్తూనే ఉంది. ఇదంతా ఇన్ డైరెక్టుగా పృథ్వీకి ప్లస్ అవుతోంది.