Begin typing your search above and press return to search.
పృథ్వీని సరిగ్గా వాడుకోవాలే కానీ..
By: Tupaki Desk | 6 March 2017 8:51 AM GMTబ్రహ్మానందం హవా ముగిసిపోతున్న టైంలోనే అనూహ్యంగా రైజ్ అయ్యాడు కమెడియన్ పృథ్వీ. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో ఉన్నా రాని పేరు.. గత రెండేళ్లలో వచ్చేసింది పృథ్వీకి. లౌక్యం.. బెంగాల్ టైగర్ లాంటి సినిమాల్లో అతడి కామెడీకి జనాలు బ్రహ్మరథం పట్టారు. కానీ ఈ కమెడియన్ని సరిగ్గా వాడుకుని కామెడీ పండించుకుంటున్న దర్శకులు తక్కువమందే అని చెప్పాలి. ఒకట్రెండు సినిమాల్లో పృథ్వీ.. నందమూరి బాలకృష్ణను ఇమిటేట్ చేసి కామెడీ పండించడంతో ఇక అందరూ దాన్నే ఫాలో అయిపోయారు. అతడికి ఆ తరహా పేరడీ క్యారెక్టర్లే రాయడం మొదలుపెట్టారు. పది రోజుల కిందట వచ్చిన ‘విన్నర్’లోనూ పృథ్వీ అలాంటి క్యారెక్టరే వేశాడు. దీంతో చాలా త్వరగా పృథ్వీ కామెడీలో మొనాటనీ వచ్చేసింది.
ఐతే ఈ విషయంలో పృథ్వీని తప్పుబట్టడానికేమీ లేదు. అతడికి మంచి కామెడీ టైమింగ్ ఉంది. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు పాత్రకు తగ్గట్లే అతడి నటన కూడా ఉంటుంది. పృథ్వీని సరిగ్గా వాడుకుంటే అతను ఏ స్థాయిలో నవ్వులు పూయిస్తాడో చెప్పడానికి ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’లో రేచి పాత్రే నిదర్శనం. రేచీకటి ఉన్న రౌడీ పాత్రలో పృథ్వీ చెలరేగిపోయాడు. ఈ సినిమాకు అతడి కామెడీనే ప్రధాన ఆకర్షణ అవుతోంది. కంటెంట్ వీక్ అయినప్పటికీ ఈ సినిమా నిలబడిందంటే అందుకు పృథ్వీ కామెడీనే ముఖ్య కారణం అనడంలో సందేహం లేదు. మరోవైపు ‘ద్వారక’లో బాబా పాత్రలోనూ పృథ్వీ బాగానే కామెడీ పండించాడు. ఇలాంటి భిన్నమైన క్యారెక్టర్లు పడితే పృథ్వీ మరో స్థాయికి తీసుకెళ్లగలడు. ఆయా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవగలడు. కాబట్టి రచయితలు.. దర్శకులు అతడితో పేరడీలు చేయించడం మాని కొంచెం వెరైటీ క్యారెక్టర్లు ట్రై చేస్తే బెటర్.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/