Begin typing your search above and press return to search.
30 ఇయర్స్ పృథ్వి క్లారిటీ ఇచ్చేశాడుగా!
By: Tupaki Desk | 23 Sep 2019 8:15 AM GMTకమెడియన్ గా తనదైన టైమింగ్ తో పేరు తెచ్చుకున్న పృథ్వి ఇటీవలే పొలిటికల్ టర్న్ తీసుకుని వైసిపి తరఫున ప్రచారం చేయడమే కాక ఆ పార్టీ గెలిచాక ఎస్విబిసి ఛానల్ లో కీలక పదవిని అందుకున్న సంగతి తెలిసిందే. గెలుపుకు ముందు క్యాంపెయిన్ లో పవన్ మీద ఘాటు కామెంట్స్ కూడా చేశాడు. ఈ కారణంగానే మెగా సినిమాల్లో ఆఫర్స్ రావడం లేదని అల వైకుంఠపురములో సైతం రీ ప్లేస్ చేశారని ఇలా రకరకాల వార్తలు వచ్చాయి.
దాన్ని పృథ్వి ఖండించినా ఆ తర్వాత వాటికి అడ్డుకట్ట పడలేదు. నిన్న జరిగిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తనకు మెగాస్టార్ అంటే ఎంత అభిమానమొ మరోసారి చాటిచెప్పే ప్రయత్నం చేశారు పృథ్వి. చిరంజీవికి ఎంతో రుణపడి ఉన్నానని చర్మం వలిచి చెప్పులు కుట్టిచ్చినా తక్కువే అనే లెవెల్ లో పొగడటం ఫ్యాన్స్ కి గుప్స్ బంప్స్ ఇచ్చినా మిగిలినవాళ్లు మాత్రం ఇదేంటి ఇంత భజనా అని అనుకున్న వాళ్ళు లేకపోలేదు
వాస్తవానికి పృథ్వి ముందు నుంచి చిరు అభిమాని అన్నది ఆయన సన్నిహితుల మాట. ఖైదీ నెంబర్ 150లో లెన్త్ కోసం తన రోల్ ని కట్ చేస్తే మీడియా ముందు వాపోయిన పృథ్వి మాటలు విని చిరు స్వయంగా ఆ సన్నివేశాలను అలాగే ఉంచేయమని వివి వినాయక్ కు చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. ఇప్పుడు కూడా సభాముఖంగా చిరు 152 లో తనకు ఛాన్స్ ఇవ్వాలని కొరటాల శివను రిక్వెస్ట్ చేయడం చూస్తే మెగాస్టార్ తో పృథ్వి ఎంత బలమైన బాండింగ్ కోరుకుంటున్నాడో అర్థమవుతోంది. తన పాత్ర తాలూకు పొడవైన డైలాగ్ ని సందర్భాన్ని వివరించిన పృథ్వి మొత్తానికి డౌట్స్ కి కొంతవరకు చెక్ పెట్టినట్టే