Begin typing your search above and press return to search.

30 ఇయ‌ర్స్ పృథ్వీపై క‌త్తి క‌ట్టిందెవ‌రు?

By:  Tupaki Desk   |   21 Aug 2019 1:56 PM GMT
30 ఇయ‌ర్స్ పృథ్వీపై క‌త్తి క‌ట్టిందెవ‌రు?
X
తెలంగాణ మూవీ టీవీ ఆర్టిస్టుల‌ సంఘం (టీఎంటీఏయు) ఎన్నిక‌లు ఈ ఆదివారం (ఈ నెల 25న) జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో 30 ఇయ‌ర్స్ పృథ్వీ ప్యానెల్ - పి.నాగేంద్ర శ‌ర్మ ప్యానెల్స్ మ‌ధ్య పోటీ నెల‌కొంది. ఇరు ప్యానెల్స్ నుంచి విధివిధానాలు హామీలు ఆక‌ర్షిస్తున్నాయి. అధ్య‌క్ష ప‌ద‌వి రేసులో ఉన్న ఇరువురి హామీల్లో ఒక హామీ మాత్రం ఆర్టిస్టుల్ని ప్ర‌ధానంగా ఆక‌ర్షిస్తోంది. అదే ద‌ళారీ(కోఆర్డినేట‌ర్) వ్య‌వ‌స్థ‌ను అంతం చేయ‌డం. ఈ విష‌యంలో పృథ్వీ -నాగేంద్ర శ‌ర్మ ఇప్ప‌టికే ఆర్టిస్టుల‌కు హామీలిచ్చారు.

పృథ్వీ ఓ ప్ర‌క‌ట‌న‌లో మాట్లాడుతూ.. ``ఇదే కృష్ణాన‌గ‌ర్ నుంచి ఎదిగిన‌వాడిని. రూ.20 కేజీ బియ్యం నుంచి రూ.2000 ఖ‌రీదైన‌ భోజ‌నం చేసే వ‌ర‌కూ క‌ళామ‌త‌ల్లి ధీవించినందుకు సంతోషిస్తున్నాను. క‌ళాకారులంతా ఆ స్థాయికి ఎద‌గాలి. ఆడా మ‌గా అనే తేడా లేకుండా అంద‌రితో క‌మిటీని ఏర్ప‌రిచి నా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో స‌మ‌ర్థంగా ప‌ని చేసేలా కృషి చేస్తాను. నాకు ఉన్న ప‌రిచ‌యాల‌తో ముఖ్య మంత్రి కేసీఆర్.. మంత్రి కేటీఆర్ వ‌ద్ద‌కు వెళ్లి టీఎంటీఏయు స‌భ్యుల‌కు హెల్త్ విష‌యంలో ఆదుకోమ‌ని కోర‌తాం. ప‌దేళ్ల పాటు నాకు ఉన్న రాజ‌కీయ అనుభ‌వాన్ని ఉప‌యోగిస్తాను. అటు ఏపీలో వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం- ఇటు తెలంగాణ నుంచి కేసీఆర్ ప్ర‌భుత్వం అండ‌దండ‌లు మ‌న‌కు ఉన్నాయి. వారి నుంచి సాయాన్ని కోర‌తాను.. అని ప్రామిస్ చేశారు.

రోజంతా క‌ష్ట‌ప‌డి ద‌ళారీ (కోఆర్డినేట‌ర్ల‌)ల‌కు ఆర్టిస్టులు ప‌ర్సంటేజీలు స‌మ‌ర్పించుకోవాల్సి వ‌స్తోంది. దానిని పూర్తిగా ర‌ద్దు చేసే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటాను. నేరుగా ప్రొడ‌క్ష‌న్ నుంచి ఆర్టిస్టుకే పారితోషికం అందేలా చేస్తాను. వృద్ధులు ఇత‌ర‌త్రా స‌భ్యుల‌కు ఫించ‌ను ఏర్పాటు చేస్తాం. ఏపీ స‌హా అన్నిచోట్లా నిధి సేక‌ర‌ణ కార్య‌క్ర‌మాలు చేద్దాం. దానిని స‌భ్యుల సంక్షేమం కోసం ఉప‌యోగించే ఆలోచ‌న ఉంది. ఫించ‌ను కార్య‌క్ర‌మాలు చేద్దాం. భ‌వంతులు నిర్మిస్తాం.. బంగారు బాట‌లు వేస్తాం! అని చెప్ప‌ను. ఒక ఆశ‌యం కోసం ఆర్నెళ్ల పాటు శ్ర‌మిస్తాం అని అన్నారు. అలాగే 730 మంది స‌భ్యుల‌తో నిరంత‌రం ఈసీ-జ‌న‌ర‌ల్ మీటింగ్ లు ఏర్పాటు చేస్తాం. మ‌న క‌మిటీ ధ‌నం వృధా ఖ‌ర్చు చేయ‌కుండా నిధిని సేక‌రించే ప్ర‌య‌త్నం చేస్తాను. విజ్ఞ‌త‌తో ఆలోచించి అధ్య‌క్ష ప‌ద‌వికి పోటీ ప‌డుతున్న నాకు.. ప్యానెల్ స‌భ్యుల‌కు ఓట్లు వేస్తార‌ని ఆకాంక్షిస్తున్నాను.. అని కోరారు. అయితే ఈసారి ఎన్నిక‌ల్లో పోటీ చేస్తున్న అభ్య‌ర్థులంతా ద‌ళారీ వ్య‌వ‌స్థ‌ను టార్గెట్ చేయ‌డంతో ప్ర‌స్తుతం ఈ రంగంలో పాతుకు పోయి ఉన్న ద‌ళారులు కం కోఆర్డినేట‌ర్ల‌లో గుబులు మొద‌లైంద‌ట‌. దీంతో పృథ్వీ, న‌టుడు శ‌ర్మ‌ల‌పై వీళ్లంతా గ‌రంగ‌రంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఆర్టిస్టుల అమాయ‌క‌త్వాన్ని అడ్డు పెట్టుకుని ల‌క్ష‌ల్లో ఆర్జిస్తున్న ద‌ళారీలు ఈ రంగంలో ఉన్నార‌న్న‌ది ఓ రిపోర్ట్.