Begin typing your search above and press return to search.
ఇదే పవనిజం అంటూ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ వీడియోలు
By: Tupaki Desk | 25 Dec 2022 5:54 AM GMTకొందరి నోటి నుంచి కొన్ని మాటలు వస్తే ఆ లెక్కే వేరుగా ఉంటుంది. అందుకు భిన్నంగా కొందరి నోటి నుంచి కొన్ని మాటలు సీరియస్ గా కాకుండా కామెడీగా మారుతుంటాయి. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ బుజ్జి వీడియో ఇప్పుడు అలానే ఉంది.
తాను అభిమానించే వారు ఎవరైనా సరే.. వారిని మునగ చెట్టు ఎక్కించేయటం.. తేడా వచ్చినంతనే వారి మీద అనుచిత వ్యాఖ్యలు చేసే ప్రముఖులు కొందరు ఉంటారు. వారి అభిప్రాయాలన్ని వారి చుట్టూనే తిరుగుతుంటాయి. ఇలాంటి వారి మాటల్ని జనాలు వింటారు కానీ సీరియస్ గా తీసుకోరు. టైం పాస్ మాటలుగా ఫీల్ అవుతారు.
ఈ చిన్న విషయాన్ని సినీ నటుడు.. థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా సుపరిచితులైన పృథ్వీ మిస్ అయినట్లున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన ఆకాశానికి ఎత్తేయటం.. ఆ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు.. చేసిన చేష్టలు ఇంకా మర్చిపోలేని పరిస్థితి. అనూహ్యంగా ఆయనకు టీటీడీ వారి చానల్ కు కీలకంగా మారటం.. ఆ సందర్భంగా మాష్టారి ఆడియో ఒకటి బయటకు వచ్చి రచ్చ కావటం తెలిసిందే. దీంతో ఆయనకు కట్టబెట్టిన కొలువును పీకి పారేసిన పరిస్థితి.
తర్వాతి కాలంలో ఎంతలా చెంపలు వేసుకున్నా.. జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఇలాంటి వేళలో.. పోయిన ఇమేజ్ ను తెచ్చుకోవాలే తప్పించి.. పార్టీ మారినంత మాత్రాన కొత్త ఇమేజ్ ఏమీ తన్నుకుంటూ రాదన్న విషయాన్ని మర్చిపోకూడదు. తాజాగా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీకి చెందిన ‘పవనిజం’ వీడియో వైరల్ గా మారింది. ఇందులో ఆయన వీరావేశంతో పవన్ కల్యాణ్ ను పొగిడేయటమే కాదు.. ఆయన జీవనవిధానాన్ని ఉద్దేశించి పవనిజంగా అభివర్ణించే అభిమానులకు తగ్గట్లుగా ఆయన పవనిజాన్నినిర్వచించారు.
‘‘స్వతంత్య్ర పోరులో భగత్ సింగ్ పోరురా పవనిజం. రామరాజు అల్లూరు సంధించిన భాణమే పవనిజం. అబ్దుల్ కలాం అనుభవమే పవనిజం. జై పవనిజం.. జైజై పవనిజ.. మనల్ని ఎవడ్రా ఆపేది’’ అంటూ వీరావేశాన్ని ప్రదర్శించటం ఆయన వరకు ఆయనకు బాగానే అనిపించినా.. చూసేటోళ్లకు మాత్రం అంత ఎఫెక్టివ్ గా లేకపోవటమే కాదు.. పవన్ వ్యతిరేక వర్గీయులు ఈ వీడియోను కామెడీగా చేసేస్తున్న పరిస్థితి.
తాను అభిమానించే పవన్ కు మేలు చేయాలన్నదే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ లాంటి వారి ఆలోచన అయితే.. అందుకు తగ్గట్లు ఆచితూచి అన్నట్లు అడుగులు వేస్తే మంచిది. ఈ విషయాన్ని ఆయన ఎప్పుడు గుర్తిస్తారో?