Begin typing your search above and press return to search.

మ‌ణిర‌త్నం చారిత్ర‌క చిత్రం డేట్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   2 March 2022 12:40 PM GMT
మ‌ణిర‌త్నం చారిత్ర‌క చిత్రం డేట్ వ‌చ్చేసింది
X
ద‌క్షిణాదిలో ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రాల జాత‌ర జ‌ర‌గ‌బోతోంది. ఇప్న‌టికే `భీమ్లానాయ‌క్‌`తో థియేర్ల వ‌ద్ద జాత‌ర హంగామా మొద‌లైంది.. మార్చి 11 నుంచి పాన్ ఇండియా చిత్రాల అస‌లు సిస‌లైన హంగామా మొద‌లు కాబోతోంది. ఈ మూవీ త‌రువాత మార్చి 25న `ఆర్ ఆర్ ఆర్‌` రానున్న విష‌యం తెలిసిందే.

దీని త‌రువాత వ‌రుస‌గా ద‌క్షిణాదితో భారీ చిత్రాలు పాన్ ఇండియా మూవీస్ థియేట‌ర్ల‌లో హ‌ల్ చ‌ల్ చేయ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాయి. ఇదే కోవ‌లో దిగ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం సినిమా కూడా రేసులో నిల‌వ‌డానికి సైరన్ మోగించేసింది.

మ‌ణిర‌త్నం డ్రీమ్ ప్రాజెక్ట్ `పొన్నియిన్ సెల్వ‌న్‌`. ఈ భారీ పిరియాడిక్ డ్రామాని రెండు భాగాలుగా `భాహుబ‌లి`, కేజీఎఫ్ , పుష్ప త‌ర‌హాలో మ‌ణిర‌త్నం తెర‌పైకి తీసుకొస్తున్నారు. క‌ల్కీ కృష్ణ‌మూర్తి ఫేమ‌స్ న‌వ‌ల `పొన్నియిన్ సెల్వ‌న్` ఆధారంగా ఈ భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఆదిత్య క‌రికాల‌న్ గా విక్ర‌మ్‌, పొన్నియిన్ సెల్వ‌న్ గా జ‌యం ర‌వి, వ‌ల్ల‌వ రాయ‌న్ వంద్య‌దేవ‌న్ గా కార్తి, నందిని అండ్ మందాకిని దేవిగా ఐశ్వ‌ర్యారాయ్ (ద్విపాత్రాభిన‌యం), కుండ‌వై పిర‌ట్టియార్ గా త్రిష త‌దిత‌ర క్రేజీ న‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

దాదాపు 500 వంద‌ల కోట్ల భారీ బ‌డ్జెట్ తో ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్న‌డూ రాని స‌రికొత్త క‌థ‌గా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా లైకా ప్రొడ‌క్ష‌న్స్ , మ‌ద్రాస్ టాకీస్ నిర్మిస్తున్నాయి. ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ ఆర్‌. రెహ‌మాన్ సంగీతం అందిస్తున్న ఈ పిరియాడిక‌ల్ డ్రామాని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేస్తున్ప‌న‌ట్టుగా చిత్ర బృందం బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్భంగా కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఐశ్వ‌ర్యారాయ్‌, విక్ర‌మ్‌, జ‌యం ర‌వి, కార్తీ త్రిశ‌ల‌కు సంబంధించిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ల‌ని విడుద‌ల చేసింది.

10వ శ‌తాబ్దం నేప‌థ్యంలో సాగే క‌థ‌గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. చోల రాజ‌వంశం చుట్టూ సాగుతుంది. ఈ రాజ్యాన్ని హ‌స్త గ‌తం చేసుకోవ‌డానికి కుటుంబాల మ‌ధ్య జ‌రిగిన స‌మ‌రం నేప‌థ్యంలో ఈ క‌థని రూపొందిస్తున్నారు. చ‌రిత్ర‌లో దాగిన వీరుల‌కు క‌థ‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ని జోడించి ఈ చిత్రాన్ని మ‌ణిర‌త్నం త‌న‌దైన పంథాలో తెర‌కెక్కిస్తున్నారు. వారియ‌ర్స్ గా ఈ చిత్రంలో విక్ర‌మ్‌, కార్తి, జ‌యం ర‌వి కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. వీరి చుట్టూ క‌థ ప్ర‌ధానంగా సాగుతుందని తెలుస్తోంది. చ‌రిత్ర‌లో చోల రాజ్యానికి చాలా ప్ర‌త్యేక‌త వుంది.

చాలా ఏళ్లు సుధీర్గంగా పాలించిన ఘ‌న‌త చోళ రాజుల‌ది. అదే అంశాన్ని చ‌ర్చిస్తూ ప‌వ‌ర్ ఫుల్ క‌థ‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు. లార్జ‌ర్ దెన్ లైఫ్ స్టోరీ కావ‌డంతో దీన్ని రెండు బాగాలుగా తెర‌పైకి తీసుకొస్తున్నారు. 2019 డిసెంబ‌ర్ లో సెట్స్ పైకి వ‌చ్చిన ఈ మూవీ కోవిడ్ కార‌ణంగా తొమ్మిది నెల‌లు ఆగిపోయింది. గ్రేట్ సోల్జ‌ర్స్ మ‌ధ్య సామ్రాజ్యం కోసం జ‌రిగే వార్ గా రూపొందిస్తున్న ఈ మూవీలోని ఫ‌స్ట్ పార్ట్ ని ఈ ఏడాది సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల చేస్తుండ‌గా పార్ట్ 2 ని వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి తీసుకురానున్నార‌ట‌.