Begin typing your search above and press return to search.

PS1 : నందినిగా ఐశర్యరాయ్‌ సెకండ్‌ ఆప్షన్‌

By:  Tupaki Desk   |   22 Sep 2022 5:18 AM GMT
PS1 : నందినిగా ఐశర్యరాయ్‌ సెకండ్‌ ఆప్షన్‌
X
మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్‌ పొన్నియిన్ సెల్వన్‌ (PS1 ) విడుదలకు సిద్ధంగా ఉంది. మరికొన్ని రోజుల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో భారీ స్టార్‌ కాస్టింగ్ ఉండటంతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సౌత్‌ ప్రేక్షకులు ఐశ్వర్య రాయ్ నటించిన సినిమా అవ్వడంతో చాలా ప్రత్యేకంగా చూస్తున్నారు. ఈ సమయం లోనే సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి.

ఈ సినిమా మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ అనే విషయం అందరికి తెల్సిందే. ఆయన ఈ సినిమా అనుకున్నది అయిదు పది సంవత్సరాల క్రితం కానే కాదు. ఏకంగా మూడు పదుల సంవత్సరాల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ ను అనుకుని నటీ నటులను కూడా సంప్రదించేందుకు ప్రయత్నాలు చేశాడట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో దర్శకుడు మణిరత్నం స్వయంగా ఈ విషయాలను చెప్పుకొచ్చారు.

తాను ఈ సినిమాను మొదట్లో అనుకున్న సమయంలో లీడ్‌ రోల్‌ లో కమల్‌ హాసన్ ను అనుకున్నాను. ఆయన కూడా మొదట సరే అన్నారు కానీ కాలం కలిసి రాక పోవడంతో సినిమా ను ఆ సమయంలో మొదలు పెట్టలేక పోయాను అంటూ మణిరత్నం చెప్పుకొచ్చాడు. ఇక ఈ సినిమాలో అందాల ఐశ్వర్యరాయ్ చేసిన నందిని పాత్రకు కూడా మొదట వేరే హీరోయిన్ ని అనుకున్నట్లుగా పేర్కొన్నాడు.

బాలీవుడ్‌ లో ఒకప్పటి స్టార్‌ హీరోయిన్‌.. లెజెండ్రీ నటి రేఖ ను ఆ సమయంలో పొన్నియన్ సెల్వన్‌ లోని అత్యంత కీలక పాత్ర అయిన నందిని పాత్రకు అనుకున్నాను. కానీ ఆ సమయంలో సినిమా వర్కౌట్ అవ్వలేదు. ఎట్టకేలకు ఇటీవల సినిమా ప్రారంభం అవ్వడం తో ఆ పాత్రకు ఐశ్వర్య రాయ్ ని తీసుకు వచ్చాడు. మందాకిని దేవి పాత్ర అయినా రేఖ తో వేయించాలని మణిరత్నం ఆశ పడ్డాడు.

కమల్ హాసన్ తో పాటు ఇంకా కొందరు స్టార్స్‌ పొన్నియన్ సెల్వన్‌ కి సంప్రదించబడ్డారు. అందులో మన తెలుగు హీరోలు మహేష్ బాబు.. ఒక మెగా హీరో.. కీర్తి సురేష్‌.. అమలా పాల్‌ ఇలా ఎంతో మందిని సంప్రదించాడు. కొందరు కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ లో భాగస్వామ్యం అవ్వలేక పోయారు.

పొన్నియన్‌ సెల్వన్‌ 1 ఈనెల 30వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తమిళ్ బాహుబలి అంటూ తెగ ప్రచారం చేస్తున్న ఈ సినిమా ఎలా ఉంటుందా అంటూ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్ల టార్గెట్‌ తో రాబోతుందట.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.