Begin typing your search above and press return to search.
PSPK - సితార బ్యానర్ 12వ సినిమా.. దసరా ట్రీట్ ఇదిగో
By: Tupaki Desk | 25 Oct 2020 6:30 AM GMTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అగ్గి రాజేస్తున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. వకీల్ సాబ్ చిత్రీకరణ పూర్తి కాగానే క్రిష్ తో మూవీని కూడా పూర్తి చేసేందుకు షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు. ఈలోగానే హరీష్ శంకర్.. సాగర్ చంద్ర .. త్రివిక్రమ్ ఇలా దర్శకులెందరో కాపు కాసుకుని వేచి చూస్తున్నారు.
నేడు విజయదశమి కానుకగా పవర్ స్టార్ కి సంబంధించిన గ్లింప్స్ ఏదైనా రిలీజవుతుందా? అని ఎదురు చూసిన అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కింగ్ ఆఫ్ యాటిట్యూడ్ ని ఎలివేట్ చేసేలా అదిరిపోయే ఎంటర్ టైనర్ ని కానుకగా ఇవ్వనున్నామని దశమి టీజర్ ని వదిలింది.
టీజర్ లో ఎస్.ఎస్.థమన్ థీమ్ మ్యూజిక్ ఆకట్టుకుంది. ఇదేదో కొత్తగా థ్రిల్లింగ్ గా అనిపించే కాన్సెప్టునే ఎంచుకున్నారన్న సింబాలిక్ మ్యూజిక్ ఇంట్రెస్ట్ పెంచింది. బ్యాక్ గ్రౌండ్ లో దొంగ దొంగ అన్న సౌండింగ్ వినిపిస్తున్నా కాస్త క్లారిటీ మిస్సయ్యింది కానీ.. ఇదేదో సంథింగ్ కొత్తగా తీస్తున్నారు! అన్న ఎలివేషన్ అయితే ఆ థీమ్ మ్యూజిక్ లో వినిపించింది. గబ్బర్ సింగ్ లో కాప్ గా నటించిన పవన్ కల్యాణ్ ని అందుకు పూర్తి ఆపోజిట్ రోల్ లో చూపిస్తున్నారా? అన్నది వేచి చూడాల్సిందే. సాగర్ చంద్ర అంటే మామూలోడు కాదు. మంచి ప్రతిభావంతుడు. అయ్యారే.. అప్పట్లో ఒకడుండేవాడు లాంటి క్లాసిక్స్ తీసిన ప్రజానాట్యమండలి భావజాలం ఉన్న డైరెక్టర్. అందుకే పవన్ - సాగర్ చంద్ర కాంబోపై ఆసక్తి పెరుగుతోంది. పీడీఎస్ ప్రసాద్ సమర్పణలో సితార సంస్థ ప్రొడక్షన్ నం.12 గా ఈ మూవీని ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుంది.