Begin typing your search above and press return to search.
జనవరి 9 నే 'అజ్ఞాతవాసి'
By: Tupaki Desk | 22 Oct 2017 11:16 AM GMTపవన్, త్రివిక్రమ్ ల కాంబోలో 'అజ్ఞాతవాసి' ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ 25 వ చిత్రంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాడట. అందుకే ఈ చిత్ర షూటింగ్ ను నవంబర్ కల్లా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఈ మాటల మాంత్రికుడు ప్లాన్ చేస్తున్నాడట. జల్సా - అత్తారింటికి దారేది చిత్రాల తర్వాత ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర కాన్సెప్ట్ పోస్టర్, అనిరుధ్ కంపోజ్ చేసిన మ్యూజిక్ బిట్ వీడియో - హీరోయిన్ కీర్తి సురేశ్ -పవన్ ల లుక్స్ ...ఈ సినిమా పై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సినిమాను ఒక రోజు ముందుగానే విడుదల చేయబోతున్నారని తెలుస్తోంది.
'అజ్ఞాతవాసి'సినిమా తర్వాత పవన్ ...జనసేన కార్యక్రమాల్లో బిజీగా ఉండబోతోన్నారని వినికిడి. ఈ సినిమా తర్వాత పవన్ ... రాజకీయాల కోసం కొన్నాళ్లపాటు సినిమాలకు బ్రేక్ ఇవ్వబోతున్నారనే పుకార్లు వినిపిస్తున్నాయి. దీంతో, ఆ సినిమా కోసం పవన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానులకు ఒక రోజు ముందే ఆనందాన్ని పంచేందుకు అజ్ఞాతవాసి సిద్ధమవబోతున్నాడట. జనవరి 9న సెకెండ్ షోతో ఆ సినిమాను విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్ లో బెనిఫిట్ షో లకు పర్మిషన్ లు లభించడం గగనమయింది. దీంతో, జనవరి 10 న మిడ్ నైట్ - ఎర్లీ మార్నింగ్ షోలకు బదులుగా జనవరి 9 సెకండ్ షోతోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. గతంలో బాహుబలి 2ను కూడా ఇలాగే విడుదల చేశారు. అనుకున్న దానికంటే ఒకరోజు ముందు పవన్ సినిమా విడుదల కాబోతుండడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.