Begin typing your search above and press return to search.

ఆడియో టాక్ః #PSPK25 బయటకొచ్చి చూస్తే

By:  Tupaki Desk   |   2 Sept 2017 11:11 AM IST
ఆడియో టాక్ః #PSPK25 బయటకొచ్చి చూస్తే
X
బయటకొచ్చి చూస్తే టైమేమో 3-ఓ-క్లాక్. ఇంటెకెళ్తుంటే రూటు మొత్తం రోడ్డు బ్లాక్.. అంటూ యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ ఒక తెలుగు పాటేసుకున్నాడు. ఇప్పటివరకు ఎన్నోసార్లు తెలుగు సినిమాలకు పనిచేస్తాడు అని రూమర్లే వచ్చాయి కాని.. తొలిసారి పవన్ కళ్యాణ్‌ సినిమాకు మనోడు కంపోజ్ చేస్తున్నాడు. గతంలో బ్రూస్ లీ మరియు అ.ఆ సినిమాలకు పనిచేయాల్సి ఈ కుర్రాడు.. ఇప్పుడు పవన్ కోసం ఏం క్రియేట్ చేశాడో చూడండి.

పవన్ కళ్యాణ్‌ 25వ సినిమా కోసం ఇప్పుడు అనిరుధ్ కంపోజ్ చేస్తున్నాడు. త్రివిక్రమ్ డైరక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలోని ఒక మెలోడియస్ సాంగ్ టీజర్ రిలీజ్ చేశారు. అందులో ఒక హోటల్ రూమ్ లో త్రివిక్రమ్ కూర్చొని వింటుంటే.. అనిరుధ్ పాడుతూ కనిపించాడు. ఆఖరిలో పవన్ కళ్యాణ్‌ విజువల్ ఒకటి కనిపించింది. మొత్తానికి ఈ సినిమా ఆల్బమ్ ను చాలా మెలోడియస్ గా రూపొందిస్తున్నారని ఈ టీజర్ బిట్ చూస్తే మనం అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్‌ సినిమాలంటేనే మ్యూజికల్ గా కూడా పెద్ద పెద్ద హిట్లు అవుతుంటాయి కాబట్టి.. ఇది పవన్ కళ్యాణ్ అభిమానులకు రొటీన్ గానే అనిపించవచ్చు.

ఇకపోతే పవన్ కొత్త సినిమాను జనవరి 10న రిలీజ్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా అఫీషియల్ గా ప్రకటించేశారు కూడా!!