Begin typing your search above and press return to search.
గరుడవేగ.. సూపర్ సండే
By: Tupaki Desk | 5 Nov 2017 6:07 PM GMT‘గరుడవేగ’ సినిమా టీజర్.. ట్రైలర్ బాగుండటంతో విడుదలకు ముందు పాజిటివ్ బజ్ వచ్చినప్పటికీ.. ట్రేడ్ వర్గాల్లో ఈ సినిమాపై ఏమంత ఆసక్తి కనిపించడం లేదు. చాలా తక్కువ థియేటర్లలోనే ఈ సినిమాను రిలీజ్ చేశారు. ప్రేక్షకులు కూడా తొలి రోజు మార్నింగ్ షోలకు ఎగబడిపోలేదు. తొలి రెండు షోలకు ఆక్యుపెన్సీ పెద్దగా లేదు. ఐతే పాజిటివ్ టాక్ స్ప్రెండ్ కావడంతో సాయంత్రానికి వసూళ్లు పుంజుకున్నాయి. ఐతే తొలి రోజు ఓవరాల్ కలెక్షన్లు మాత్రం ఆశాజనకంగా లేవు. కోటి రూపాయల షేర్ కూడా రాలేదు. కానీ రెండో రోజు నుంచి సీన్ మారింది. థియేటర్లు.. స్క్రీన్లు పెరిగాయి. కలెక్షన్లు కూడా పుంజుకున్నాయి. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు రెట్టింపు వసూళ్లు వచ్చినట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు.
ఇక ఆదివారానికైతే ‘గరుడవేగ’ కథే మారిపోయింది. మూడో రోజు ఈ సినిమా అన్ని చోట్లా హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయింది. ముందు వారాల్లో వచ్చిన పాత సినిమాల జోరు తగ్గిపోవడం.. పోటీగా వచ్చిన కొత్త సినిమాలు తేలిపోవడంతో ప్రేక్షకులకు ‘గరుడవేగ’నే ఫస్ట్ ఛాయిస్ అయింది. మూడో రోజుకు థియేటర్లు.. షోలు బాగా పెరగడం కూడా కలిసొచ్చి మంచి వసూళ్లు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇంకా గణాంకాలు బయటికి రాలేదు కానీ.. పరిస్థితి అయితే ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐతే సోమవారం నుంచి సినిమా ఎలా ఆడుతుందన్నది కీలకం. వీక్ డేస్ లో ఓ మోస్తరు వసూళ్లతో నిలబడగిగితే.. బయ్యర్లు సేఫ్ జోన్లోకి రావచ్చు. నిర్మాత కూడా కొంతమేర పెట్టుబడి రికవర్ చేసుకోవచ్చు. సినిమా మీద రూ.25 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినప్పటికీ బిజినెస్ మాత్రం ఆ స్థాయిలో జరగలేదు. కొన్ని ఏరియాల్లో నిర్మాత సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది.