Begin typing your search above and press return to search.
కావాల్సినంత పాపులరిటీ తెచ్చిపెట్టిన పబ్ కేసు..!
By: Tupaki Desk | 6 April 2022 9:35 AM GMTహైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్ లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్ లో ఆదివారం తెల్లవారుజామున టాస్క్ ఫోర్స్ పోలీసులు చేసిన తనిఖీలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపాయి. ర్యాడిసన్ హోటల్ లో నిర్వహిస్తున్న ఈ పబ్ లో దాడులు చేసిన సమయంలో ఉన్న 140 మందికి పైగా యువతీ యువకులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పోలీసులు వారి వివరాలు సేకరించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారని తెలుస్తోంది.
పబ్ కేసు రాజకీయంగా వివాదంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఘటనలో ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా పబ్ నిర్వహిస్తున్న మేనేజర్ అనిల్ సహా మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్న సినీ ప్రముఖుల్లో బిగ్ బాస్ విన్నర్, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ మరియు మెగా డాటర్ నిహారిక కొణిదెల ఉండటంతో అందరి దృష్టి వారిపై పడింది.
ఇక పబ్ వ్యవహారంలో పట్టుబడ్డ సెలబ్రిటీల పిల్లలు ఎక్కడ తమ ఐడెంటిటీ బయటపడుతోందని భయపడుతున్నారు. మరికొందరు మాత్రం దీన్ని ఉపయోగించుకొని పాపులర్ అయిపోతున్నారని తెలుస్తోంది. ఏ తప్పూ చేయకపోయినా మీడియాలో సోషల్ మీడియాలో తమ పేర్లు బయటకు రావడంతో ఫ్యామిలీ ఇబ్బంది పడుతోంది అంటూ అప్ కమింగ్ ఆర్టిస్ట్ కుషిత ఓ వీడియో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తమను కించపరిచేలా వార్తలు ప్రసారం చేయొద్దంటూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఇందులో భాగంగా బజ్జీలు తినడానికి పబ్ కి వెళ్లానని.. చీజ్ బజ్జీలు తిన్నానని.. రెగ్యులర్ గా చీజ్ బజ్జీల కోసమే పబ్ కి వెళ్తానని కుషిత చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
'ఇంకా నయం పండుగ రోజు ఉగాది పచ్చడి తినడానికే పబ్ కి వెళ్లానని చెప్పలేదు' అంటూ ఆమె పై మీమ్ రాయుళ్లు రెచ్చిపోయారు. అంతేకాదు ఆమె తనకు విపరీతంగా ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. దయచేసి తనపై అసత్య ప్రచారం చేయొద్దని.. తన ఫ్యామిలీని ఇబ్బంది పెట్టొద్దని వేసుకుంటూ కొన్ని వీడియోలు కూడా పోస్ట్ చేసింది. కుషిత ఆవేదనతో చెప్తున్నా.. ఈ పబ్ వ్యవహారమంతా పరోక్షంగా కుషితకు సోషల్ మీడియాలో మరింత పాపులారిటీ తెచ్చిపెడుతోంది.
షార్ట్ ఫిల్మ్ చేసినా రాని గుర్తింపు.. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ ఆమెను సెలబ్రిటీగా మార్చేస్తున్నారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగాక అంత ధైర్యంగా మీడియా ముందుకు వచ్చినందుకు ఆమెను మెచ్చుకునేవారు కూడా ఉన్నారు. ఏదేమైనా ఈ పబ్ వ్యవహారం కొందరికి దురదృష్టం అయితే.. మరికొందరరికి మాత్రం ఇది అదృష్టంగా మారుతోందనే చెప్పాలి.
ఇకపోతే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో పబ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో రాజకీయ సినీ రంగ ప్రముఖులు ఉన్న నేపథ్యంలో తీవ్ర ఒత్తిడి వస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులపై ఎలాంటి ఆరోపణలు లేకుండా దర్యాప్తు చేసేందుకు టీమ్ సిద్ధమవుతోంది. ఈ రోజు పబ్ కు మొత్తం 250 మంది వరకు వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మిగిలిన వారి కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరోవైపు పుడింగ్ అండ్ మింక్ పబ్ కు ఇచ్చిన బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ ను ఎక్సైజ్ శాఖ రద్దు చేసింది. పబ్ లో జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. దాడిలో కొకైన్ తో పాటు ఇతర మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్ లో నమోదు చేశారని తెలుస్తోంది. ఈ కేసుని సమీక్షించి పబ్, బార్ అండ్ రెస్టారెంట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది.