Begin typing your search above and press return to search.
పబ్లిక్ ఒపీనియన్: టాలీవుడ్ లో నెక్స్ట్ 'మెగాస్టార్' లేదా 'సూపర్ స్టార్' ఎవరు..?
By: Tupaki Desk | 9 April 2021 2:30 AM GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతీ జనరేషన్ కి కొందరు హీరోలు స్టార్స్ గా తయారవుతుంటారు. ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయడం - సక్సెస్ రేట్ - మార్కెట్ - స్టార్డమ్ వంటి అంశాలను దీని కోసం పరిగణలోకి తీసుకోవచ్చు. టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరోలు - స్టార్ హీరోలను పక్కన పెడితే ప్రస్తుతం చాలా మంది యువ హీరోలు, సినిమా కోసం నిరంతరం కష్టపడుతూ స్టార్ హీరో స్టేటస్ కోసం ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్ లో టాలీవుడ్ లో మెగాస్టార్ లేదా సూపర్ స్టార్ అయ్యే సత్తా ఉన్న హీరో ఎవరనే దానిపై ప్రజాభిప్రాయం తెలుసుకోడానికి 'తుపాకీ డాట్ కామ్' ఓ పోల్ నిర్వహించింది.
'తుపాకీ' పోల్ లో ఎక్కువ మంది సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవకొండ కు ఓటేసారు. మొత్తం పోలైన వాటిలో 32.73% ఓట్లతో విజయ్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి.. సినిమా సినిమాకి క్రేజ్ తో పాటు మార్కెట్ కూడా పెంచుకుంటూ వస్తున్న విజయ్ కి స్టార్ హీరోగా మారే సత్తా ఉందని ప్రేక్షకులు భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. వీడీ ఇప్పుడు 'లైగర్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత అతని స్టార్డమ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లే అవకాశం ఉంది.
నేచురల్ స్టార్ నాని 21.87% ఓట్లతో రెండో స్థానంలో నిలిచాడు. కెరీర్ ఆరంభం నుంచి సినిమా కోసం కష్టపడుతూ వచ్చిన నాని.. తన సహజమైన నటనతో అభిమానులను పెంచుకున్నాడు. సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టే వారికి ఆదర్శంగా నిలిచిన నాని నెక్స్ట్ స్టార్ హీరో అవుతాడని జనాలు భావిస్తున్నారు. ఇప్పటికే 25 సినిమాల్లో నటించిన నాని.. త్వరలో 'టక్ జగదీష్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలానే 'శ్యామ్ సింగ రాయ్' 'అంటే.. సుందరానికీ!' అనే రెండు సినిమాలో నటిస్తున్నాడు.
మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా వైవిధ్యమైన సినిమాలు ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోగా మారే సత్తా వరుణ్ కు ఉందని 19.13% మంది అభిప్రాయ పడుతున్నారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం 'ఎఫ్ 3' మరియు 'గని' వంటి సినిమాలలో నటిస్తున్నాడు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య 8.61% ఓట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపించే చైతూ.. తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన తండ్రి తర్వాత అక్కినేని లెగసీని కాపాడే హీరోగా నిలుస్తాడని ప్రేక్షకులు భావిస్తున్నారు. 'లవ్ స్టోరీ' చిత్రాన్ని రిలీజ్ కి రెడీ చేసిన చైతన్య.. ప్రస్తుతం 'థాంక్యూ' అనే సినిమాలో నటిస్తున్నాడు.
ఎనెర్జిటిక్ స్టార్ నుంచి ఉస్తాద్ గా ఎదిగిన రామ్ పోతినేనికి 7.32% మంది మద్దతుగా నిలిచారు. యాక్టింగ్ తోనే కాకుండా తన డాన్సులతో ప్రేక్షకులకు దగ్గరైన రామ్ తనకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నాడు. ప్రస్తుతం లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇక యూత్ స్టార్ నితిన్ కు ఈ పోల్ లో 5.67% ఓటు రాగా.. మెగా హీరో సాయి తేజ్ కు 4.67% మంది ఓటేశారు. నితిన్ ప్రస్తుతం 'మాస్ట్రో' అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో నటిస్తుండగా.. సాయి తేజ్ 'రిపబ్లిక్' అనే పొలిటికల్ థ్రిల్లర్ మూవీ చేస్తున్నాడు.