Begin typing your search above and press return to search.

పులి మేక.. అందరికి ముఖ్యమే

By:  Tupaki Desk   |   19 Jun 2022 7:30 AM GMT
పులి మేక.. అందరికి ముఖ్యమే
X
ఇటీవల కాలంలో కొంత మంది అగ్ర దర్శకులు నిర్మాతలు అందరూ కూడా వెబ్ సీరీస్ లతో బిజీ అవుతున్న విషయం తెలిసిందే. వెబ్ కంటెంట్ కు జనాలు కూడా అలవాటు పడుతుండడంతో అక్కడ మంచి మార్కెట్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జి5 నుంచి కూడా విభిన్నమైన ప్రాజెక్టులను జనాల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. త్వరలోనే కోన ఫిలిం కార్పొరేషన్ తో సంయుక్తంగా పులి మేక అనే వెబ్ సిరీస్ ను రూపొందించనుంది. ప్రాజెక్టుకు సంబంధించిన పనులు కూడా ఇటీవల మొదలయ్యాయి.

పోలీస్ క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠి ఆది సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా ప్రముఖ నటుడు సుమన్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఈ ప్రాజెక్టు మాత్రం హీరో హీరోయిన్ కు మాత్రమే కాకుండా దర్శకుడు కూడా చాలా ముఖ్యంగా మారింది. వారందరు భారీ ఆశలు పెట్టుకున్నారు.

హీరోయిన్ లావణ్య త్రిపాఠి గత కొంతకాలంగా వరుస పరాజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇక పులి మేక ప్రాజెక్టుతో ఆమె మళ్లీ ఫామ్లోకి రావాలని చూస్తోంది. అలాగే ప్రముఖ నటుడు ఆది సాయి కుమార్ కూడా ఇంతవరకు సరైన సక్సెస్ అందుకోలేదు. దీంతో ఈ వెబ్ సిరీస్ అతనికి కూడా చాలా ముఖ్యం కానుంది. అందరి కంటే ఎక్కువగా ఈ ప్రాజెక్ట్ పై దర్శకుడు చక్రవర్తి కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు.

ఇంతకు ముందు కొన్ని సినిమాలకు రచయితగా పనిచేసిన అతను గోపిచంద్ పంతం ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఆ సినిమా ప్లాప్ అయ్యింది కాబట్టి పులి మేక ప్రాజెక్ట్ సక్సెస్ కావాలని అతను కూడా చాలా హార్డ్ వర్క్ చేసినట్లుగా తెలుస్తోంది. స్క్రిప్ట్ పనులు అన్నీ పూర్తయ్యాయి. ఇక ఇటీవల పూజా కార్యక్రమాలతో ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పనులు కూడా మొదలు పెట్టడానికి సిద్ధమయ్యారు. పోలీస్ క్రైమ్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో విభిన్నమైన ట్విస్టులు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయట. ఒక సైకో కిల్లర్ పోలీసులను టార్గెట్ చేస్తూ వారిని ఎలా హతమార్చాడు ఆ తరువాత అతనకి హీరో ఎలా అడ్డుకట్ట వేశారు అనేది ఈ సినిమాలో హైలెట్ పాయింట్ అని తెలుస్తోంది.