Begin typing your search above and press return to search.
విజయ్ దురదృష్టం.. కోట్లలో నష్టం
By: Tupaki Desk | 2 Oct 2015 11:30 AM GMTవిజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో పులి తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ విజువల్ గ్రాఫిక్స్ - ఫిక్సన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా తమిళ్ - తెలుగు బాక్సాఫీసుల్ని ఓ ఊపు ఊపేస్తుందని అంచనా వేశారు.
అతిలోక సుందరి శ్రీదేవి - హన్సిక - శ్రుతిహాసన్ వంటి నటీనటులు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. దేవీశ్రీ మ్యూజిక్ - కమల్ కణ్ణన్ గ్రాఫిక్స్.. ఇవన్నీ ఈ సినిమాకి రెండు భాషల్లోనూ ప్లస్ అవుతాయనే భావించారు. భారీ కాస్టింగ్ - భారీ సాంకేతికత అందరినీ ఆకర్షించింది. విజయ్ ఫ్యాన్స్ తలుచుకుంటే మొదటివారంలోనే ఈ సినిమా 100 కోట్ల వసూళ్లు ఈజీగా అధిగమిస్తుందని అంచనాలేశారు. సరిగ్గా ఇలాంటి టైమ్ లో అయితే పులి మీద పుట్రలా ఐటీ అధికారుల దాడులు పులి హీరోని, నిర్మాతని ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ ప్రభావం పులి రిలీజ్ పై తీవ్రంగా పడింది.
అనుకున్న టైమ్ కి ఈ సినిమా రిలీజ్ కాకుండా ఆగిపోయింది. తెలుగులో భారీ అంచనాల నడుమ ఉన్న ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూశారు . కానీ మొదటి రోజు రిలీజ్ కాకపోవడం, ఇప్పటికీ ఈ సినిమా రిలీజ్ విషయమై క్లారిటీ లేకపోవడంతో అంతా అయోమయ పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ లు చేసుకున్న వారంతా అవాక్కయ్యే పరిస్థితి నెలకొంది. మరోవైపు దెబ్బ మీద దెబ్బలా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్న నిర్మాతలను వేరొక సమస్య చుట్టుముట్టడంతో అది కూడా నెగెటివ్ అయిపోయిందని చెప్పుకుంటున్నారు.
కారణం ఏదైనా పులి సినిమాకి భారీ డ్యామేజ్ జరిగింది. ఒక్క రోజులో కోట్లలో నష్టం భరించాల్సి వచ్చినట్టే. ఇప్పటికైనా ఈ సినిమా తెలుగు వెర్షన్ సజావుగా రిలీజై జనాల్లో క్రేజు తెచ్చుకుంటే బతికి బయటపడేదే. తెలుగులో రిలీజ్ హక్కులు 8 కోట్లు పలికాయని చెబుతున్నారు. అంత పెద్ద మొత్తాల్ని రికవరీ చేయాలంటే ఇప్పుడున్న బ్యాడ్ ఫేజ్ లో ఎలా సాధ్యం అనేవాళ్లు ఉన్నారు. ఏదేమైనా అంత భారీ ఎఫర్ట్ పెట్టి తీసిన సినిమాకి ఇలాంటి పరిస్థితి రావడం ఇబ్బందికర పరిణామాల్నే క్రియేట్ చేస్తోంది.