Begin typing your search above and press return to search.
ఆ కెపాసిటీ ఎవరికి ఉందబ్బా..?
By: Tupaki Desk | 26 Sep 2015 1:30 PM GMTవిజయ్ హీరోగా చింబుదేవన్ దర్శకత్వంలో పులి తెరకెక్కిన సంగతి తెలిసిందే. గాంధీ జయంతికి ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 1న పులి రిలీజవుతోంది. అయితే ఈ సినిమా పూర్ పబ్లిసిటీ ప్రస్తుతం ఇండస్ర్టీలో చర్చకొచ్చింది. ఈ సినిమాకి సంబంధించి మెయిన్ కాస్టింగ్ ఎవరూ ఇంతవరకూ హైదరాబాద్ లో కానీ, ముంబైలో కానీ అడుగుపెట్టిందే లేదు. ప్రమోషన్ చేసిందే లేదు. ఈ నేపథ్యంలో తెలుగు - హిందీలో ఈ సినిమా ప్రమోషన్ లేకుండా ఆడుతుందా? అన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. ప్రమోషన్ లేకపోయినా జనాల్ని థియేటర్ వైపు రప్పించే కెపాసిటీ ఈ సినిమాలోని అరడజను స్టార్ లలో ఎవరికి ఉంది? అన్న టాపిక్ పై రచ్చ చేస్తున్నారంతా.
కేవలం ట్రైలర్లు ఆన్ లైన్ లో చూసి పులి రిలీజవుతోంది అని తెలుసుకోవడం వరకే పరిమితమైంది. విజయ్ ని చూసి తెలుగులో కానీ, హిందీలో కానీ ఆడియెన్ థియేటర్ లకు వస్తారని అనుకోలేం. అంత ఐడెంటిటీ ఈ రెండు చోట్లా అతడికి లేదు. అతడు నటించిన సినిమాలు తెలుగులో అడపా దడపా వచ్చి వెళుతున్నాయంతే. అలాగే హన్సిక తెలుగులో తెలుసు. అయితే బాలీవుడ్ లో మాత్రం 50-50 స్టార్ మాత్రమే. తన రేంజు స్టార్ హీరోయిన్ రేంజ్ కానేకాదు. ఉన్నంతలో అతిలోక సుందరి శ్రీదేవి ఛరిష్మానే ఈ సినిమాని కాపాడాలి. ఈ వయసులోనూ శ్రీదేవి మహారాణి పాత్రలో అదరగొట్టేసిందనే భావిస్తున్నారంతా. అందువల్ల తొలిరోజు ఓపెనింగ్స్ శ్రీదేవి వల్లే రావాలి. మరో హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా పులి సినిమాకి అస్సెట్ అవుతోంది.
శ్రుతిహాసన్ ఇటు తెలుగు - అటు తమిళ్ మరోవైపు హిందీలోనూ పాపులర్ స్టార్. అనతి కాలంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది కాబట్టి శ్రుతిని చూడడం కోసమైనా యూత్ థియేటర్లకు వస్తారు. ఇక ఈగ విలన్‌గా సుదీప్ తెలుగు - తమిళ్ - హిందీలోనూ తెలుసు కాబట్టి అతడి విలనీ కొంతవరకూ సినిమాకి కలిసొస్తుంది.. అయితే ఈ స్టార్ లెవరూ ఇంతవరకూ టాలీవుడ్ ప్రమోషన్ కి రాకపోవడం ఆశ్చర్యకరం. శ్రీదేవి ప్రస్తుతం అమెరికా వెళ్లిపోయారని టాలీవుడ్ లో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు చెబుతున్నారు. బాహుబలి తర్వాత మళ్లీ అంతటి క్రేజీ ప్రాజెక్టుగా చెబుతున్న ఈ సినిమా ప్రమోషన్ లో ఇంత వీక్ గా ఉండడం కూడా అంతే చర్చకొచ్చింది. ఇంకో వారమే వెయిట్ అండ్ సీ.