Begin typing your search above and press return to search.

తెలుగులో 1200, హిందీలో 1500 స్క్రీన్లు

By:  Tupaki Desk   |   1 Aug 2015 5:51 AM GMT
తెలుగులో 1200, హిందీలో 1500 స్క్రీన్లు
X
బాహుబలి సాధించిన అసాధారణ విజయం 'పులి'ని ఇంప్రెస్‌ చేసిందా? అంటే అవుననే అనిపిస్తోంది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి తెలుగుతో పాటు, తమిళ్‌, హిందీ, మలయాళంలోనూ భారీ వసూళ్ల ను దక్కించుకుని రికార్డులు తిరగరాస్తోంది. అదే బాటలో తాను కూడా వెళ్లాలని విజయ్‌ తపిస్తున్నాడు.

చింబుదేవన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన పులి చిత్రాన్ని తెలుగు, తమిళ్‌, హిందీ లో ఏకకాలంలో రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ లో 1500 థియేటర్ల లో, ఏపీ-తెలంగాణలో 1200 థియేటర్ల లో రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మలయాళంలోనూ విజయ్‌ కి అభిమానులు ఉనారు కాబట్టి అక్కడా సేమ్‌ టైమ్‌ రిలీజ్‌ చేయనున్నారు. నిర్మాత పి.టి.సెల్వకుమార్‌ మాట్లాడుతూ.. ''ఈ సినిమా కథాంశంలో యూనివర్శల్‌ అప్పీల్‌ ఉంది. తమిళ్‌ తో పాటు పొరుగు భాషల్లోనూ ఆకట్టుకుంటుంది. విదేశాల్లోనూ మెప్పిస్తుంది. జపాన్‌, చైనా లోనూ తర్వాత రిలీజ్‌ చేస్తామని అన్నారు.

పులి ఆడియో వేడుకను రేపు సాయంత్రం ఓ బీచ్‌ రిసార్ట్‌ లో ప్లాన్‌ చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిధులుగా సల్మాన్‌ ఖాన్‌, మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున, మోహన్‌ లాల్‌ తదితరులు హాజరవ్వనున్నారు.