Begin typing your search above and press return to search.

పులి.. విడ్డూరం చూశారా?

By:  Tupaki Desk   |   28 Sep 2015 9:30 AM GMT
పులి.. విడ్డూరం చూశారా?
X
ఇది నిజంగా విడ్డూరమే మరి. అభిమానులు ‘ఇళయ దళపతి’ అని పిలుచుకునే విజయ్ కి తమిళంలో ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. రజినీకాంత్ తర్వాత తమిళనాట ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ ఉన్నది విజయ్‌ కే. అలాంటోడి సినిమా అక్కడ 700 థియేటర్లలో మాత్రమే విడుదలవుతోంది. ఇక ఈ హీరోకు తెలుగులో పెద్దగా ఫాలోయింగ్ లేదన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ తెలుగులో ఈ సినిమా దాదాపు 800 థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

అంటే తమిళంలో కంటే తెలుగులో వంద థియేటర్లు ఎక్కువన్నమాట. తమిళనాట థియేటర్లు తక్కువన్న సంగతి తెలిసిందే. అక్కడున్నథియేటర్ల కంటే రెట్టింపు స్క్రీన్స్ ఉన్నాయి మనదగ్గర. అందుకే అన్నమాట ఈ తేడా. ఇంతకుముందు రజినీకాంత్ - కమల్ హాసన్ సినిమాలకు కూడా ఇలాగే జరిగింది. తమిళంలో కంటే తెలుగులో ఎక్కువ స్క్రీన్స్ లభించాయి.

ప్రపంచవ్యాప్తంగా ‘పులి’ సినిమాను దాదాపు 3500 థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు సమాచారం. తొలిసారిగా అతడి సినిమా హిందీలోనూ ఒకేసారి విడుదలవుతుండటం విశేషం. హిందీలో దాదాపుగా 1500 థియేటర్లలో సినిమాను విడుదల చేస్తున్నారట. కేరళలో - కర్ణాటకలో కూడా పులి హంగామా బాగానే ఉంది. ఓవర్సీస్‌ లోనూ విజయ్ కెరీర్ లోనే అత్యంత భారీగా సినిమాను విడుదల చేస్తున్నారు. ఇంకో మూడు రోజుల్లో, అంటే అక్టోబరు 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.