Begin typing your search above and press return to search.
పులి పిల్లిలా వెనక్కెళ్లిపోయాడు
By: Tupaki Desk | 2 July 2015 6:58 AM GMTమా 'పులి' ముందు బాహుబలి నిలుస్తాడా? సౌత్‌లోనే నంబర్ వన్ కలెక్షన్లతో పులి దుమ్ము దులిపేస్తుంది.. అంటూ బీరాలు పలికారు విజయ్ అభిమానులు. అందుకు తగ్గట్టే బాహుబలి ట్రైలర్‌తో పోటీపడుతూ పులి ట్రైలర్‌కి ఆన్‌లైన్‌లో క్లిక్స్ కొట్టారు. మావాడి ముందు మీవాడెంత? అని పోటీకొచ్చారు. ప్రభాస్ పులి ముందు తలవంచాల్సిందే అన్నారు.
బాహుబలికి తొలిరోజు 15లక్షల క్లిక్కులు పడితే, పులికి మరో ఐదు లక్షలు అదనంగా అంటే 20లక్షల క్లిక్కులొచ్చాయి. ఇదే మా విజయానికి పరాకాష్ట అంటూ విజయ్ ఫ్యాన్స్ విర్రవీగారు. అయితే బాహుబలి విజువల్స్ ముందు పులి విజువల్స్ తేలిపోయాయంటూ యునానిమస్ రిపోర్ట్ వచ్చింది. అందుకే ఇప్పుడు పులి వెనకడుగు వేసింది. సెప్లెంబర్ వరకూ రిలీజ్‌ని వాయిదా వేసుకున్నారు. అంటే ఏకంగా రెండ నెలలు వెనక్కి వెళ్లిపోయారు.
కారణం ఏదైనా బాహుబలి ముందు పులి తోక ఝాడించే ఛాన్సే లేకుండా పోయింది. కేవలం యూట్యూబ్, ఆన్‌లైన్ క్లిక్కులతో జిమ్మిక్కు చేస్తామంటే కుదరదు డియర్ ఫ్యాన్స్. సినిమాలో దమ్ముండాలి. విజిబిలిటీలో స్పార్క్ ఉండాలి. అవన్నీ బాహుబలిలో ఉన్నాయి. విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ లాంటి విషయాల్లో బాహుబలి ఆల్‌టైమ్ గ్రేట్. ఇంతవరకూ ఇండియన్ సినిమా హిస్టరీలోనే అలాంటి విజువల్స్ కనిపించలేదు. అందుకే బాలీవుడ్ సైతం దాసోహం అంటోంది. అయితే పులి కథానాయకుడు విజయ్‌ని ఎవరూ తక్కువ అంచనా వేయలేదు. సౌత్‌లోనే అత్యుత్తమ హీరోల్లో అతడు ఒకడనడంలో సందేహమే లేదు.
అయితే పులి విఎఫ్‌ఎక్స్, డ్రెస్ కోడ్, హీరో అప్పియరెన్స్‌పైనే విమర్శలున్నాయి. అయినా 250కోట్ల ముందు 70కోట్ల పెట్టుబడి సినిమా నిలుస్తుందా? ఇండియన్ తొలి హిస్టారికల్ 3డి సినిమా రుద్రమదేవి 3డినే వాయిదా వేసుకున్నారు. రాజమౌళి మాహిష్మతి ప్రపంచం ముందు ఎవరూ నిలవలేరన్నది నిజం. అందుకే పులి వెనక్కి వెళ్లింది. అదీ సంగతి.