Begin typing your search above and press return to search.
ఆ ఫోన్ కాల్ ముందే చేసి ఉండొచ్చుగా
By: Tupaki Desk | 14 Nov 2015 7:30 AM GMTకొన్నిసార్లు మిస్ కమ్యూనికేషన్ ముప్పుతిప్పలు పెట్టేస్తుంది. ఇద్దరిమధ్యా మిస్ అండర్ స్టాండింగ్స్ కి కారణం అవుతుంది. అది మీడియా వరకూ చేరితే రచ్చ రచ్చే. ఇటీవలి కాలంలో అతిలోక సుందరి శ్రీదేవి - పులి నిర్మాతల మధ్య ఇష్యూలో ఇలాగే జరిగింది. నాకు ఇవ్వాల్సిన బకాయి సొమ్ములు తిరిగి ఇవ్వనేలేదు. నిర్మాతలు నన్ను అడ్డంగా బుక్ చేశారు బాబోయ్ అంటూ శ్రీదేవి ఏకంగా ముంబై నిర్మాతల సంఘంలో ఫిర్యాదు చేసింది. ఫలితం పులి నిర్మాతలపై అందరికీ బ్యాడ్ ఒపీనియన్ వచ్చింది. శ్రీదేవి అంత పెద్ద స్టార్ విషయంలో ఇలా చేస్తారా? అంటూ ప్రపంచం నోళ్లు నొక్కుకుంది.
అయితే ఇదంతా కేవలం మిస్ కమ్యూనికేషన్ - మిస్సండర్ స్టాండింగ్ వల్లనే జరిగిందని చెబుతున్నాడు పులి నిర్మాత శిబు తమీన్. శ్రీదేవి మ్యాడమ్ అంటే చాలా గౌరవం ఉంది. అయితే మిస్ కమ్యూనికేషన్ వల్లనే అలా జరిగింది. మ్యాడమ్ తో ఫోన్ లో మాట్లాడి సెటిల్ చేసుకున్నాం. వాస్తవానికి పులి హిందీ శాటిలైట్ హక్కుల్లోంచి 20 పర్సంట్ ఆదాయాన్ని ఇస్తామని చెప్పాం. ఆ ప్రకారమే తనకి సెటిల్ చేశాం. ఎలాంటి ఇబ్బందులు మా మధ్య లేవు ఇప్పుడు... అంటూ తమీన్ క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే శ్రీదేవి ముంబై అసోసియేషన్ లో ఫిర్యాదు ఇవ్వకముందే ఈ ఫోన్ కాల్ వెళ్లి ఉంటే ఎంత బావుండేది. ఇంత రచ్చ అయ్యేది కాదు కదా! అంత పెద్ద స్టార్ కేవలం 50 లక్షల కోసం మిమ్మల్ని అంత ముప్పు తిప్పలు పెట్టి ఉండేది కాదు కదా! ఫోన్ కాల్ తో సమస్య పరిష్కారం అయ్యేది. ప్చ్! అంటున్నారంతా.