Begin typing your search above and press return to search.
చరణ్ ని ఎగ్జైట్ చేసిన పులి మేక టీజర్..!
By: Tupaki Desk | 17 Feb 2023 10:46 PM GMTరైటర్ గా ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథ అందించిన కోనా వెంకట్ రీసెంట్ గా మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమాకు కూడా రచనా సహకారం అందించిన విషయం తెలిసిందే. ఇక లేటెస్ట్ గా కోనా వెంకట్ ఓ వెబ్ సీరీస్ కు కథ అందించడం జరిగింది. జీ తెలుగు నిర్మించిన పులి మేక వెబ్ సీరీస్ కు కోనా వెంకట్ కథ అందించగా చక్రవర్తి రెడ్డి డైరెక్ట్ చేశారు. ఆది సాయికుమార్, లావణ్య త్రిపాఠి నటించిన ఈ సినిమా టీజర్ ని మెగా పవర్ స్టార్ రాం చరణ్ రిలీజ్ చేశారు.
ఈ టీజర్ తనని ఎగ్జైట్ అయ్యేలా చేసిందని తన సోషల్ మీడియాలో కామెంట్ చేశారు చరణ్. ఇక టీజర్ విషయానికి వస్తే సిటీలో జరిగే హత్యలకు కారణమైన వారిని పట్టుకునే క్రమంలో పోలీసులు ఎలా ఈ కేసుని డీల్ చేశారు అన్నది వెబ్ సీరీస్ కథ. జీ తెలుగులో ఇదివరకు వచ్చిన వెబ్ సీరీస్ లకు తెలుగు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పులి మేకకు కూడా అదే విధమైన రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. జీ తెలుగులో ఇప్పటికే ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, మా నీళ్ల ట్యాంక్, లూజర్, హలో వరల్డ్, అహనా పెళ్లంట రీసెంట్ గా ఏటీఎం వెబ్ సీరీస్ లు వచ్చాయి.
వాటికి ధీటుగా ఈ పులిమేక కూడా ఆడియన్స్ ని అలరించడానికి వస్తుంది. సినిమాలో ఆది సాయి కుమార్ ఫోరెన్సిక్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా లావణ్య త్రిపాఠి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నటించింది. ఈ ఇద్దరు కలిసి చేసిన మొదటి కాంబో వెబ్ సీరీస్ ఇదే అని చెప్పొచ్చు. ఈ వెబ్ సీరీస్ లో సీనియర్ యాక్టర్ సుమన్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ ఫేం సిరి కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటించింది. మరి ఈ పులి మేక అనుకున్నట్టుగా ఆడియన్స్ ని అలరించడం లో సక్సెస్ అవుతుందా లేదా అన్నది చూడాలి.
ఈమధ్య వెబ్ సీరీస్ లు కూడా సినిమాలకు ఈక్వల్ గా ఆడేస్తున్నాయి. తమకు నచ్చిన సీరీస్ ను రిపీటెడ్ గా చూసేస్తున్నారు ఆడియన్స్. వారికి కావాల్సిన ఎంటర్టైన్ మెంట్ ఎక్కడ దొరుకుతుందో అక్కడకి వెళ్లి మరి అది వెబ్ సీరీస్ అయినా, ఇండిపెండెంట్ మూవీ అయినా చూసేస్తున్నారు. వాటి తరహాలోనే ఈ పులి మేక వెబ్ సీరీస్ కూడా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.