Begin typing your search above and press return to search.
ఫోటోగ్రాఫర్ పై దాడి చేసిన హీరో
By: Tupaki Desk | 25 Jan 2017 9:57 AM GMTబాలీవుడ్ హీరో పులకిత్ సామ్రాట్ ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిపోయాడు. ప్రస్తుతం ఈ హీరో తన భార్య శ్వేత రోహిరాతో విడాకులు తీసుకోనున్నాడు. పులకిత్- శ్వేతల బ్రేకప్ ఇప్పటికే ఖాయం కాగా.. తాజాగా విడాకుల కేసు దాఖలు చేసేందుకు బాంద్రా కోర్టుకు వచ్చాడు ఈ హీరో.
కోర్టులో విడాకుల కేసు ఫైల్ చేసి బయటకు వస్తుండగా.. పులకిత్ సామ్రాట్ ను ఫోటో తీసేందుకు ఫోటో జర్నలిస్టులు ప్రయత్నించారు. దీంతో ఈ హీరోకి విపరీతంగా కోపం వచ్చేసి.. ఓ ఫోటోగ్రాఫర్ పై దాడికి దిగాడు. ఎందుకు ఫోటోలు తీస్తున్నావంటూ.. కాలర్ పట్టుకుని మరీ గొడవ చేశాడు. కోర్టులో నుంచి పులకిత్ బయటకు వస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సెలబ్రిటీలను ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్లు ప్రయత్నించడం సహజం. కానీ హీరోగా చెలామణీ అవుతున్న పులకిత్ సామ్రాట్.. ఇప్పుడు ఇలా ప్రవర్తించడం విపరీతంగా చర్చనీయాంశం అవుతోంది. ఫోటోగ్రాఫర్ పై ఈ హీరో దాడి చేసిన ఫోటోలు నెట్ లో విపరీతంగా షేర్ అవుతున్నాయి.
ఇదిలా ఉంటే.. పులకిత్ సామ్రాట్ కు యామీ గౌతమ్ తో అఫైర్ ఉందని.. అతని భార్య శ్వేత రోహిరా గతంలోనే ఆరోపించింది. తమ అనుబంధం విడాకులకు దారి తీయడానికి కారణం.. యామీనే అని చెప్పిందామె. తన ఇమేజ్ ను దెబ్బ తీసేందుకు వ్యక్తిగత విషయాలను బైటకు తీస్తోందన్నాడు పులకిత్. విడాకులు తప్ప తనకు వేరేదారి లేదని తేల్చేశాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/