Begin typing your search above and press return to search.

బెదిరిస్తున్నాడు కానీ వదలడం లేదు

By:  Tupaki Desk   |   6 Sep 2016 9:30 AM GMT
బెదిరిస్తున్నాడు కానీ వదలడం లేదు
X
బుల్లితెర నుంచి బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి వచ్చి సెటిల్ అయిన హీరో పుల్కిత్ సామ్రాట్. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తనను ఫాలో అవుతున్నవారిని తెగ బెదిరించేస్తున్నాడు ఈ కుర్రాడు. ఇందుకు కారణం.. పర్సనల్ రిలేషన్స్ పై జనాలు చేస్తున్న కామెంట్స్.

కండలవీరుడు సల్మాన్ ఖాన్ కి చెల్లెలు వరసయ్యే అమ్మాయి శ్వేత రోహిరాను నవంబర్ 2014లో పెళ్లి చేసుకున్న పుల్కిత్.. సరిగ్గా ఏడాది తర్వాత విడిపోయాడు. ఎందుకు విడిపోయారనే విషయాన్ని ఈ హీరో చెప్పకపోయినా.. మరో హీరోయిన్ యామి గౌతమ్ తో ఏర్పడిన అనుబంధమే కారణమనే టాక్ ఉంది. చివరకు శ్వేత రోహిరా కూడా ఈ విషయాన్ని కన్ఫాం చేసేసింది. సనమ్ రే మూవీ షూటింగ్ టైమ్ లో పుల్కిత్ సామ్రాట్- యామి గౌతమ్ లు బాగా దగ్గరైపోయారని అంటారు. ఈ విషయంపై చాలానే చర్చలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. పుల్కిత్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి.

దీంతో 'ఈ వర్చవుల్ ప్రపంచం మంచిదే కానీ.. మరీ అంత మంచిది కాదు.. ఇక చాలు.. ఇకపై ట్వీట్స్ ఉండవు' అంటూ ట్వీట్స్ పెట్టాడు. నేను దేన్నీ పట్టించుకోనని కూడా విరుచుకు పడ్డాడు. అంతే కాదు.. జనాలను ఎంటర్టెయిన్ చేస్తే తాము వీక్ అయిపోతామని.. అది మానేస్తే స్ట్రాంగ్ గా ఉండొచ్చని అంటున్నాడు కూడా. ఫుల్లుగా తాగేసి ట్వీట్స్ పెడుతున్నావంటూ మళ్లీ జనాలు ఎదురుదాడి చేయడంతో.. ఇక ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేస్తానని బెదిరిస్తున్నాడు. అంటున్నాడు కానీ.. ఇంకా పుల్కిత్ అకౌంట్ యాక్టివ్ గానే ఉంది లెండి. కొందరు చెబ్తారంతే.. చెయ్యరు.