Begin typing your search above and press return to search.
తిట్లు - అలకలతో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్
By: Tupaki Desk | 25 Sep 2019 5:03 AM GMTబిగ్ బాస్ షోలో అసలు ఆట ఇప్పుడే మొదలైనట్లు అనిపిస్తోంది. ఇన్ని వారాలు ఆట ఒక ఎత్తు అయితే....10వ వారం ఆట ఒక ఎత్తులా నడుస్తోంది. సోమవారం ఎపిసోడ్ లో ఎలిమినేషన్ ప్రక్రియ తర్వాత ఇంటి సభ్యుల మధ్య పెద్ద చర్చలే నడిచాయి. మొదట బాబా భాస్కర్ - వరుణ్ డిస్కషన్ చేశారు. పునర్నవి హౌస్ లో ఉండాలంటే ఉండొచ్చు కాని.. తనకు భాష రాదని విమర్శించడం నచ్చలేదన్నారు. ఆమె తనపై ఆరోపణలు చేస్తుంటే క్లారిటీ ఇవ్వాలని అనిపించలేదని అందుకే వదిలేశా అన్నారు. ఇన్ని వారాలు తన ఆటని ప్రేక్షకులు చూశారని - అందుకే ఇంకా ఏం చెప్పాలని అనుకోలేదని అన్నారు.
ఇక ఇదే విషయాన్ని వరుణ్...పునర్నవి - రాహుల్ మధ్య చర్చ జరుగుతుండగా చెప్పారు. ఇదే సమయంలో వచ్చిన వితికా...నామినేషన్ సమయంలో తనపై రవి ఆరోపణలు చేయడాన్ని తప్పుబట్టింది. ఈ సందర్భంగా రవితో మళ్ళీ మాట్లాడావా ? అని వరుణ్ వితికాని అడిగాడు. దీనికి పునర్నవి కల్పించుకుని రవిగాడు వెధవ.. ఆ వెధవతో ఎందుకు మాట్లాడాలి.. వాడితో సొల్లు డిస్కషన్ ఎందుకు అంటూ తెగ రెచ్చిపోయింది. పనికిమాలిన ఆర్గ్యుమెంట్ చేసే అలాంటి వెధవతో మాట్లాడాల్సిన అవసరం లేదని - వాడి బతుకు పెట్టుకుని ఎప్పుడైనా తన ఒపీనియన్ ని చెప్పాడా ? వెటకారంగా నవ్వుతాడు ప్రతిదానికి అంటూ చెలరేగిపోయింది.
ఆ తర్వాత నామినేషన్ ప్రక్రియ గురించి శ్రీముఖి - బాబా భాస్కర్ చర్చ పెట్టారు. నామినేషన్ సమయంలో ఒకరికి ఒకరు ఓటు వేయకపోవడంపై హార్ట్ అయినట్లు చెప్పారు. మామూలుగా తనకు ఇంట్లో ఎవరితోనూ పెద్ద బాండింగ్ ఉండదు...మీతోనే ఉంటుందని శ్రీముఖి - బాబాతో చెప్పింది. అయితే ఇక నుంచి అలాంటి బాండింగ్ పెట్టుకోనని - ఎవరు గేమ్ వారు ఆడదామని - కాసేపు ఒంటరిగా వదిలేసి వెళ్ళమని బాబాతో అంది. దీంతో బాబా అక్కడ నుంచి ఫీల్ అవుతూ వెళ్ళిపోయారు...తర్వాత శ్రీముఖి కూడా ఫీల్ అవుతూ కూర్చుంది. ఆ నెక్స్ట్ డే కూడా నామినేషన్స్ గురించి ఇంట్లో చర్చలు నడిచాయి.