Begin typing your search above and press return to search.

వీడియో: మైకేల్ జాక్స‌న్ లా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లా!

By:  Tupaki Desk   |   1 Nov 2021 6:40 AM GMT
వీడియో: మైకేల్ జాక్స‌న్ లా.. జూనియ‌ర్ ఎన్టీఆర్ లా!
X
ప్ర‌పంచ వ్యాప్తంగా అసాధార‌ణ ఫాలోయింగ్ ఉన్న డ్యాన్సింగ్ స్టార్ మైఖేల్ జాక్స‌న్. అత‌డి ఒంట్లో ఎముక‌లు ఉన్నాయా లేవా? అని సందేహించేవారు లేక‌పోలేదు. అంత‌టి ఫ్లెక్సిబిలిటీ స్వింగ్ మైఖేల్ జాక్స‌న్ లో మాత్ర‌మే చూడ‌గ‌లం. ఆ త‌ర్వాత ఇండియ‌న్ మైఖేల్ జాక్సన్ గా ప్ర‌భుదేవా డ్యాన్సుల‌కు గుర్తింపు ఉంది. ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి.. జూనియ‌ర్ ఎన్టీఆర్... అల్లు అర్జున్.. రామ్ చ‌ర‌ణ్ .. సాయి తేజ్.. వీళ్లంతా ఎంతో ఫ్లెక్సిబుల్ గా డ్యాన్సులు చేయ‌గ‌ల‌రు. బాలీవుడ్ లో హృతిక్ .. టైగ‌ర్ ష్రాఫ్ డ్యాన్సులు మైండ్ బ్లాక్ చేస్తాయి.

అయితే వీళ్ల‌లాగా శాండల్ వుడ్ లో ఎవ‌రున్నారు? అంటే క‌న్న‌డ చిత్ర‌సీమ‌ను రెండు ద‌శాబ్ధాల పాటు ఉర్రూత‌లూగించిన అప్పు అలియాస్ పునీత్ రాజ్ కుమార్ పేరునే సూచిస్తున్నారు అభిమానులు. అత‌డు ఆక‌స్మిక గుండెపోటుతో మ‌రణించ‌డం అభిమానుల‌ను శోక సంద్రంలో ముంచేసింది. అయితే ఆయ‌న అభిమానులు ఇప్పుడు పునీత్ డ్యాన్స్ మూవ్ మెంట్స్ కి సంబంధించిన మాష‌ప్ వీడియోల్ని అంతే వైర‌ల్ చేస్తున్నారు.

క‌న్నడ నాట ప‌వ‌ర్ స్టార్ అని కీర్తినందుకున్న పునీత్ రాజ్ కుమార్ లో అంత ఏం ఉంది? అన్న‌ది అర్థం చేసుకోవ‌డానికి ఈ డ్యాన్సింగ్ మాష‌ప్ వీడియో చూస్తే చాలు. అత‌డు బాల న‌టుడిగా కొన‌సాగుతున్న రోజుల నుంచి ఎంత క‌ఠోరంగా శ్ర‌మించాడో అర్థం అవుతుంది. జూనియ‌ర్ ఎన్టీఆర్ లో ఉన్నంత ఫ్లెక్సిబిలిటీ అత‌డి బాడీలో ఉంద‌ని ఆ డ్యాన్సులు చూశాక అంగీక‌రించాల్సిందే. మైఖేల్ జాక్స‌న్ లా మూన్ వాక్ చేయ‌డంలోనూ పునీత్ ఎక్స్ ప‌ర్ట్. ఫ్లోర్ డ్యాన్స్ .. బ్రేక్ డ్యాన్స్.. వెస్ట్ర‌న్ స్టైల్ డ్యాన్సుల్లోనూ పునీత్ హార్డ్ వ‌ర్క్ ఈ వీడియోల‌లో క‌నిపించింది. ముఖ్యంగా అత‌డి అథ్లెటిక్ ఫీట్స్ కానీ.. బాడీలో ఫ్లెక్సిబిలిటీ కానీ వండ‌ర్ ఫుల్ అనాల్సిందే. కెరీర్ లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాల్లో న‌టించాడు. ఇక అత‌డు నిరంత‌ర ఫిట్నెస్ ఫ్రీక్. త‌న‌కు న‌ల‌త‌గా ఉంద‌ని తెలిసినా జిమ్ ని విడిచిపెట్ట‌నంత‌గా అడిక్ష‌న్ ఉంది. అత‌డి మ‌ర‌ణానికి కార‌ణం కూడా ఇదేన‌ని డాక్ట‌ర్లు విశ్లేషించడం విచార‌క‌రం.

పునీత్ మ‌ర‌ణానికి కార‌ణ‌మిదే!

క‌న్న‌డ హీరో పునీత్ రాజ్ కుమార్ శుక్ర‌వారం ఉద‌యం జిమ్ లో వ‌ర్క‌వుట్లు చేస్తుండ‌గా కార్డియాక్ అరెస్ట్ కి గురై మ‌ర‌ణించారు. దీంతో ఆరోగ్యం గా ఉన్న పునీత్ కి గుండెపోటు ఆక‌స్మికంగా ఎందుక‌ని వ‌చ్చింది? అంటూ డాక్ట‌ర్లు సైతం షాక్ అయ్యారు. పునీత్ మ‌ర‌ణ వార్త‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌లేక‌పోయారు. తాజాగా కార్డియాక్ అరెస్ట్ వెనుక ఆస‌క్తిక‌ర సంగ‌తులే ఉన్నాయ‌ని ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. పునీత్ కి గురువారం రాత్రి నుంచే ఆరోగ్యం స‌రిగ్గా లేద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. అంటే రోజు ముందు నుంచే సింప్ట‌మ్స్ బ‌య‌ట‌ప‌డ్డాయ‌నేదే దీన‌ర్థం.

వైద్యులు తెలిపిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆరోగ్యం స‌రిగ్గా లేక‌పోయినా పునీత్ శుక్ర‌వారం ఉద‌యం జిమ్ కి వెళ్లారు. ఓంట్లో న‌ల‌త‌గా ఉన్నా పునీత్ వాటిని ప‌ట్టించుకోకుండా హెవీ వ‌ర్కౌట్లు చేసారు. ఆ కార‌ణంగా ఒక్క‌సారిగా పునీత్ కార్డియాక్ అరెస్ట్ కి గుర‌య్యారు. అది తీవ్ర‌మైన‌ గుండె పోటుగా మారింది. ఒక్క‌సారిగా గుండె కొట్టుకోవ‌డం మానేసి ఉండ‌వ‌చ్చు అని పునీత్ డాక్ట‌ర్ రాహుల్ ఎస్ పాటిల్ తెలిపారు. ఊపిరి తీసుకునే విష‌యంలో.. గుండెకి సంబంధించి ఏదైనా అసౌక‌ర్యంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవ‌డం మంచిద‌ని సూచించారు. ప‌రుగెత్త‌డం. .. వ్యాయామం చేయ‌డం వంటికి గుండెకి అద‌న‌పు భారాన్ని మోపుతాయి. ఆ స‌మ‌యంలోనే గుండె ప‌నిచేయ‌డం మానేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. దీనికి వ‌య‌సుతో సంబంధం లేదు. గుండెపై అద‌న‌పు భారం ప‌డిన‌ప్పుడే ఇలా జ‌రుగుతుంద‌ని కొన్ని నివేదిక‌లు సైతం చెబుతున్నాయి. గుండె పోటు వ‌చ్చే ముందు కొన్ని ర‌కాల మార్పులు సైతం శ‌రీరంలో చోటు చేసుకుంటాయి. 46 ఏళ్ల పునీత్ చిన్న వ‌య‌సులో చ‌నిపోవ‌డానికి కార‌ణం ఆరోగ్యంగా లేక‌పోయినా జిమ్ కి వెళ్ల‌డ‌మే ఆయ‌న చేసిన త‌ప్పిదంగా క‌నిపిస్తోంది.