Begin typing your search above and press return to search.
పునీత్ రాజ్ కుమార్ మృతి: సినీ రాజకీయ ప్రముఖుల దిగ్భ్రాంతి
By: Tupaki Desk | 29 Oct 2021 11:48 AM GMTకన్నడ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.కన్నడ కంఠీరవుడు రాజ్ కుమార్ తనయుడు పునీత్ రాజ్ కుమార్ మరణంతో శాండిల్ వుడ్ తోపాటు ఇతర సినీ పరిశ్రమల్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన అకాల మరణ వార్త విన్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులతోపాటు రాజకీయ ప్రముఖులు సైతం సోషల్ మీడియాలో సంతాపం తెలిపారు.
-షాకయ్యా: కర్ణాటక సీఎం
పునీత్ రాజ్ కుమార్ మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. పునీత్ మరణంతో తాను తీవ్రషాక్ కు గురయ్యానని కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై తెలిపారు.పునీత్ మరణం కన్నడ చిత్రసీమకు , కర్ణాటకకు తీరని లోటు అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అన్నారు. పునీత్ మరణం తనను కలిచివేసిందని కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప అన్నారు. చిన్న వయసులోనే మనందరినీ వదిలి వెళ్లిపోవడం కలిచివేస్తోందన్నారు.
చిరంజీవి సంతాపం
తన హృదయం ముక్కలైందని.. పునీత్ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోతారని అనుకోలేదని.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు చిరంజీవి ప్రకటించారు.
నందమూరి బాలక్రిష్ణ
పునీత్ మరణంతో గొప్ప స్నేహితుడిని కోల్పోయా. ఆయన మృతి కన్నడ చిత్ర పరిశ్రమకు తీరనిలోటు. తండ్రికి తగ్గ తనయుడు .వారి కుటుంబానికి నా సానుభూతి అని బాలక్రిష్ణ అన్నారు
మోహన్ బాబు
పునీత్ రాజ్ కుమార్ చాలా మంచి మనిషి. భగవంతుడు కొన్ని సార్లు ఇలా ఎందుకు చేస్తాడో నాకు అర్థం కాదు. సినీ ప్రపంచానికి విషాదకరరోజు అని మోహన్ బాబు వాపోయారు.
పునీత్ రాజ్ కుమార్ లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నా.. ఆత్మకు శాంతి చేకూరాలి: నాగార్జున
మహేష్ బాబు సంతాపం
పునీత్ రాజ్ కుమార్ లేరనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. నేను కలిసిన మాట్లాడిన గొప్ప వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన కుటుంబానికి నా సంతాపం అని మహేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు
ఎన్టీఆర్
నా హృదయం ముక్కలైంది. మమ్మల్ని వదిలి మీరు ఇంత త్వరగా వెళ్లిపోయారనే విషయాన్ని నమ్మలేకపోతున్నా: జూనియర్ ఎన్టీఆర్.
రాంచరణ్
నా ప్రియమైన స్నేహితుడు పునీత్ కల్మషం లేని వ్యక్తి. తన తండ్రి నటవారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. నటనతోపాటు వ్యక్తిత్వంతో ఎంతో మంది అభిమాన్ని చూరగొన్నారు.
-అంత త్వరగా వెళ్లిపోయావా అప్పూ.. జీర్ణించుకోలేకపోతున్నా: ప్రకాష్ రాజ్
-ఇది నిజం కాదు పునీత్ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా: మంచు లక్ష్మీ
-పునీత్ మరణ వార్త తో షాక్ అయ్యా: వరుణ్ తేజ్
-ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే పునీత్ . ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా: నటుడు రామ్ పోతినేని