Begin typing your search above and press return to search.
ఫ్యాన్స్ కు పునీత్ రాజ్ కుమార్ భార్య ఎమోషనల్ మెసేజ్
By: Tupaki Desk | 18 Nov 2021 9:38 AM GMTకన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మృతి వార్తను అభిమానులు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. అప్పు సర్ అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇక పునీత్ యాదిలో ఎంతో మంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఆయన మృతి వార్తతో చాలా మంది గుండెలు పగిలాయి.
ఆయన మరణ వార్తను కుటుంబ సభ్యులు మాత్రమే కాకుండా యావత్త్ సినీ లోకం మరియు ప్రేక్షక లోకం కూడా జీర్ణించుకోవడానికి ఇంకా ఇబ్బంది పడుతూనే ఉంది. అభిమానులు ఇంకా కూడా శోకంలో ఉన్న నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్వినీ రాజ్ కుమార్ స్పందించారు. ఆమె ఇప్పటికే అభిమానులు దయచేసి ఆత్మహత్య చేసుకోవద్దు అంటూ విజ్ఞప్తి చేసింది.
తాజాగా పునీత్ రాజ్ కుమార్ భార్య అశ్విని ఇన్ స్టా గ్రామ్ లో జాయిన్ అయ్యారు. తాజాగా ఆమె తన భర్త అప్పు మరణంతో బాధ పడుతున్న అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ ఇచ్చింది. అప్పు మృతి మా కుటుంబంకు మాత్రమే కాకుండా అభిమానులకు కూడా కన్నీరు మిగిల్చింది. అభిమానులు ఈ సమయంలో ధైర్యంగా ఉండాలని ఆమె కోరింది.
పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన తర్వాత ఆయన కళ్లు దానం చేసిన విషయాన్ని తెలుసుకున్న ఎంతో మంది అభిమానులు ఇప్పుడు తమ కళ్లను దానం చేసేందుకు రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. ఈమద్య కాలంలో వందల కొద్ది రిజిస్ట్రేషన్ లు అవ్వడం అభినందనీయం అంటూ అశ్వినీ పేర్కొన్నారు.
పునీత్ చనిపోయిన విషయం ప్రతి ఒక్కరికి బాధను కలిగించింది. ఆయన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి కూడా ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమయంలో ఆయన ఆశయాలను మరియు ఆయన ప్రారంభించిన పనులను తాను కొనసాగించబోతున్నట్లుగా కూడా ఆమె పేర్కొన్నారు.
అభిమానులు అధైర్యపడవద్దంటూ విజ్ఞప్తి చేసింది. అభిమానులకు అండగా తాను ఉంటాను అన్నట్లుగా హామీ ఇచ్చింది. అశ్విని సోషల్ మీడియా ఎంట్రీ ఇవ్వడంను అప్పు అభిమానులు స్వాగతించారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఈమెను ఫాలో అయ్యే వారి సంఖ్య 50 వేలకు పెరిగింది. అప్పుపై ఉన్న అభిమానం ను అంతా కూడా అశ్విని పై చూపుతున్నారు. అభిమానుల గురించి ఇంతగా ఆలోచిస్తున్న అశ్వినిని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.