Begin typing your search above and press return to search.
ట్విట్టర్ పై వార్ ప్రకటించిన స్టార్ హీరో ఫ్యాన్స్!
By: Tupaki Desk | 15 July 2022 1:06 PM GMTకన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ గత ఏడాది అక్టోబర్ లో హార్ట్ ఎటాక్ కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తమ అభిమాన హీరో హఠత్తుగా మృత్యుఒడిలోకి వెళ్లిపోవడం జీర్ణించుకోలేక దుఖః సాగరంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి సినిమా `జేమ్స్` రిలీజ్ సమయంలో వెండితెరపై అప్పూని చూస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారి ప్రతీ ఒక్కరినీ కంట తడి పెట్టించాయి.
ఇదిలా వుంటే పునీత్ రాజ్ కుమార్ అభిమానులు తాజాగా ట్విట్టర్ పై వార్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఉన్నట్టుండి ట్విట్టర్ పై పునీత్ అభిమానులు విరుచుకుపడటానికి ప్రధాన కారణంగా ఆయన అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ @PuneethRajkumar వెరఫైడ్ అకౌంట్.
అయితే తాజాగా వెరిఫైడ్ అకౌంట్ కు సింబల్ గా వున్న బ్లూ మార్క్‌ని ట్విట్టర్ వర్గాలు తొలగించాయి. దీంతో పునీత్ ఫ్యాన్స్ ట్విట్టర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ట్విట్టర్ పై సోషల్ మీడియా వేదికగా యుద్దానికి సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఎందుకు పునీత్ ట్విట్టర్ ఖాతాకు వున్న బ్లూ టిక్ ని తొలిగించారని మండిపడుతున్నారు. అంతే కాకుండా కొంత మంది పవర్ స్టార్ అభిమానులు ఇటీవల చనిపోయిన సిద్ధార్ద్ శుక్లా, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ట్విట్టర్ హ్యాండిల్స్ కున్న బ్లూటిక్ అలాగే వుందని, అలాంటప్పుడు మా హీరో పునీల్ ట్విట్టర్ ఖాతాకున్న బ్లూ టిక్ ని ఎలా తొలగిస్తారంటూ ట్విట్టర్ ఇండియా ప్రతినిధుల్ని ప్రశ్నిస్తున్నారు.
నేను ట్విట్టర్ లో వుండటానికి ప్రధాన కారణం పునీత్ రాజ్ కుమారే అని కామెంట్ చేస్తే మరో అభిమాని దయచేసి మా హీరో ఖాతాని ధృవీకరించి మళ్లీ వెరిఫైడ్ బ్లూ టిక్ ని యాడ్ చేయండి అంటూ కోరుతున్నారు.
అభిమానులు ఎంతగా రిక్వెస్ట్ చేస్తున్నా ట్విట్టర్ ఇండియా వర్గాల నుంచి మాత్రం ఫ్యాన్స్ కు ఎలాంటి రిప్లై రాకపోవడంతో పునీత్ అభిమానులు మరింతగా కామెంట్ లు చేయడం మొదలు పెట్టారట. ఇప్పటికైనా ట్విట్టర్ వర్గాలు దిగొచ్చి పునీల్ అకౌంట్ వెరిఫైడ్ అకౌంట్ గా మారుస్తారో చూడాలి. అక్టోబర్ 29న మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ దాహ సంస్కరాలని కర్ణాటక ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించింది.