Begin typing your search above and press return to search.

పునీత్ రాజ్ కుమార్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ.. వైరల్

By:  Tupaki Desk   |   30 Oct 2021 12:30 AM GMT
పునీత్ రాజ్ కుమార్, అశ్విని రేవంత్ లవ్ స్టోరీ.. వైరల్
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం తీవ్ర గుండెపోటుతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఫిట్ నెస్ కు ప్రాధాన్యత ఇచ్చే తమ అభిమాన హీరో పునీత్ మరణాన్ని కన్నడ ప్రజలు, అభిమానులు, సినీ ఇండస్ట్రీ తట్టుకోలేకపోతోంది. ఈ సందర్భంగా అతడి వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఈనేపథ్యంలోనే పునీత్ రాజ్ కుమార్ లవ్ స్టోరీ గురించి వైరల్ అవుతోంది.

పునీత్ ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరీ ముఖ్యంగా అతడి అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. కడసారి నివాళులర్పించేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు.

పునీత్ రాజ్ కుమార్ తన కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయిన అశ్విని రేవంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. స్నేహంగా మొదలైన వీరిద్దరి పరిచయం అనంతరం ప్రేమగా మారింది. 8 నెలల స్నేహం తర్వాత పునీత్ ఆమెకు ప్రపోజ్ చేయగా.. ఆమె వెంటనే అంగీకరించింది.

అయితే అన్ని ప్రేమ కథల్లాగానే వీరి ప్రేమకథ కూడా అడ్డంకులూ అభ్యంతరాలు వచ్చాయి. కానీ ఓపికగా పెద్దలను ఒప్పించి వీరి ప్రేమను గెలిపించుకున్నారు.

పునీత్-అశ్విని పెళ్లికి పునీత్ కుటుంబం సంతోషంగా ఒప్పుకున్నా.. అశ్విని కుటుంబం మాత్రం అంగీకరించలేదు. ఆరు నెలల తర్వాత ఎట్టకేలకు అశ్విని కుటుంబం ఆమోదం తెలిపింది.

చివరకు 1999న డిసెంబర్ 1న పునీత్-అశ్విని రేవంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ ప్రశంసలందుకున్నారు. ఈ దంపతులకు దృతి, వందిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సజావుగా సాగిపోతున్న వీరి 20 ఏళ్ల కాపురాన్ని చూసి విధికి కన్నుకుట్టిందేమో కానీ పునీత్ ను అర్తాంతరంగా ఈ లోకం నుంచి తీసుకెళ్లిపోయింది.