Begin typing your search above and press return to search.
షాకింగ్ .. తెరపై అప్పూని చూస్తూ అభిమాని...!
By: Tupaki Desk | 19 March 2022 7:39 AM GMTకన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ను అభిమానులు ఏ స్థాయిలో అభిమానిస్తారు అనేది ఆయన మృతి చెందిన తర్వాత తెలిసింది. కేవలం హీరోగా మాత్రమే కాకుండా పలు సేవా కార్యక్రమాలతో కోట్లాది మంది గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న పునీత్ మరణంతో ఎంతో మంది బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. పునీత్ మరణం విషయం తెలిసి ఎంతో మంది గుండెలు బాదుకుని కన్నీరుమున్నీరయ్యారు.
ఆయన మరణ వార్త విన్న పలువురు అభిమానులు చనిపోయిన సంఘటనలు కూడా కర్ణాటకలో జరిగాయి. ఆయన చనిపోయి నెలలు కావస్తున్నా ఇప్పటికీ కూడా ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఆయనకు సంబంధించిన విషయాల గురించి చూస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన నటించిన చివరి చిత్రం జేమ్స్ విడుదల అయ్యింది. కర్ణాటక సినీ చరిత్రలో ఎప్పుడూ లేనంత రెస్పాన్స్ ను జేమ్స్ సినిమా కు దక్కింది.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత పునీత్ చనిపోయాడు. దాంతో ఆ సినిమాలో పునీత్ పాత్రకు గాను శివ రాజ్ కుమార్ డబ్బింగ్ చెప్పడం జరిగింది. తాజాగా పునీత్ మొదటి జయంతి సందర్భంగా సినిమా ను భారీ ఎత్తున విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అభిమానుల కోలాహలం ఆకాశాన్ని తాకింది.
ఈ కోలాహలంలో అభిమానులు ఎంతో మంది తమ అభిమానాన్ని చాటుకునే ఎందుకు వివిధ రకాలుగా ప్రయత్నించారు. ఒక అభిమాని వెండి తెరపై తన అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ ని చూస్తూ చనిపోయాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా గ్రామంలో జరిగింది.
నంజనగూడు గ్రామానికి చెందిన 22 ఏళ్ల ఆకాశ్ అనే కుర్రాడు సినిమా చూస్తూ తోటి అభిమానులతో సందడి చేస్తూ గుండె పోటుతో మరణించినట్లు స్థానిక మీడియా మరియు అభిమానులు ధ్రువీకరించారు. ఇంతకు ముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని పూర్తి ఆరోగ్యంగా ఉండేవాడని తల్లి మంజుల తెలియజేశారు. పునీత్ రాజకుమార్ చనిపోయినప్పటి నుండి కూడా ఆకాష్ బాధపడుతూనే ఉన్నాడని మంజుల పేర్కొన్నారు. ఆకాశ్ మరణం పట్ల తోటి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.