Begin typing your search above and press return to search.
వినయ్ చేతుల మీదుగా పునీత్ రాజ్ కుమార్ అంత్యక్రియలు పూర్తి
By: Tupaki Desk | 31 Oct 2021 4:27 AM GMTకన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు పూర్తి అయ్యాయి. ఆదివారం ఉదయం ఆరు గంటలకు మొదలైన అంత్య క్రియలు ఏడున్నర వరకు పూర్తి అయ్యాయి. ఈ అంత్య క్రియల్లో కన్నడ సీఎం బొమ్మై తో పాటు మాజీ సీఎం ఇంకా ప్రముఖ సినీ నటీ నటులు, రాజకీయ వర్గాల వారు మరియు అశేష అభిమానులు హాజరు అయ్యారు. పునీత్ రాజ్ కుమార్ కు ఇద్దరు కుమార్తెలే కనుక అంత్య క్రియలను ఎవరి చేత చేయిస్తారు అనే చర్చ జరిగింది. చివరకు పునీత్ రాజ్ కుమార్ సోదరుడు అయిన రాఘవేంద్ర రాజ్ కుమార్ పెద్ద కొడుకు అయిన వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఈ అంత్య క్రియల్లో పాల్గొన్నారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబ ఆచారం ప్రకారం ఖననం చేయడం జరిగింది.
లెజెండ్రీ స్టార్ రాజ్ కుమార్ సమాధి కంఠీరవ స్టూడియో లో ఉంది. తండ్రి సమాధి పక్కనే పునీత్ రాజ్ కుమార్ ను కూడా ఖననం చేయడం జరిగింది. అక్కడే సమాధి కూడా నిర్మించబోతున్నారు. శుక్రవారం ఉదయం సమయంలో మృతి చెందిన పునీత్ రాజ్ కుమార్ మృత దేశంకు శనివారం సాయంత్రం అంత్య క్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అందుకోసం కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వం ఏర్పాట్లు కూడా చేసింది. కాని యూఎస్ లో ఉంటున్న పునీత్ రాజ్ కుమార్ పెద్ద కుమార్తె ధృతి రాజ్ కుమార్ బెంగళూరు చేరుకోవడం లో ఆలస్యం అయ్యింది. ఆమె శనివారం సాయంత్రంకు గాను బెంగళూరు చేరుకున్నారు. దాంతో సూర్యస్తమయం తర్వాత అంత్యక్రియలు నిర్వహించకూడదు అనే ఉద్దేశ్యంతో వాయిదా వేశారు.
రాత్రి కూడా అభిమానుల సందర్శనార్థం పునీత్ రాజ్ కుమార్ మృత దేహంను ఉంచారు. తెల్లవారు జామున ఆరు గంటల వరకు పునీత్ రాజ్ కుమార్ ను అభిమానుల సందర్శణకు ఉంచారు. ఆ తర్వాత నుండి అంత్య క్రియల ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. వినయ్ రాజ్ కుమార్ చేతుల మీదుగా పునీత్ రాజ్ కుమార్ అంత్య క్రియలు నిర్వహించి కుటుంబ పెద్దలు మరియు రాజకీయ మరియు సినీ రంగ ప్రముఖులు ఘన నివాళ్లు అర్పించారు. ప్రభుత్వ లాంచనాల ప్రకారం పునీత్ రాజ్ కుమార్ మృత దేహం పై త్రివర్ణ పతాకం ఉంచడం జరిగింది. మొన్నటి వరకు కళ్ల ముందు సందడి చేసిన పునీత్ రాజ్ కుమార్ మట్టిలో ఖననం అవ్వడంను ఆయన అభిమానులు జీర్ణించుకోలేక సొమ్మసిల్లి పడిపోయారు. ఎంతో మంది అభిమానులు గుండెలు అవిసేలా ఏడ్చారు. ఇక ఆయన్ను చూడలేము అనే బాధ ప్రతి ఒక్కరిలో కనిపించింది. ఒక కన్నడ సినీ దిగ్గజం నెలకొరిగింది.. కనుమరుగయ్యింది అంటూ సినీ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.