Begin typing your search above and press return to search.
పునీత్ రియల్ సూపర్ స్టార్ అనేందుకు మరో రుజువు
By: Tupaki Desk | 9 Nov 2021 2:30 AM GMTకన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మృతి చెంది రెండు వారాలు కావస్తున్నా కూడా ఇంకా ఆయన జ్ఞాపకాల్లోనే కన్నడ సినీ ప్రేమికులు మరియు అభిమానులు ఉన్నారు. పునీత్ రాజ్ కుమార్ మృతి చెందిన తర్వత కాని ఆయన సేవా కార్యక్రమాలు బయటకు రాలేదు. పునీత్ రాజ్ కుమార్ నిర్వహించే సేవా కార్యక్రమాలను ఎప్పుడు కూడా బహిరంగంగా ప్రచారం చేసుకోలేదు. ఆయన ఎంతో సింపుల్ గా సినిమాల్లో కనిపించే వారో.. ఎంతో సింపుల్ గా జనాల్లో మమేకం అయ్యే వారో అందరికి తెల్సిందే. అంతే సింపుల్ గా తన సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని ఆయన మృతి చెందిన తర్వాత కాని తెలియదు. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇండియన్ హీరోలు ఏ ఒక్కరు చేయడం లేదేమో అనిపిస్తుంది.
26 అనాథాశ్రమాలు.. 45 పాఠశాలలు.. 16 వృద్ధాశ్రమాలు.. 19 గోశాలలు.. 1800 మంది పిల్లల చదువు ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ప్రతి ఏడాది భారీ ఎత్తున ఈ సేవా కార్యక్రమాలకు గాను ఖర్చు చేస్తున్నారు. ఆయన చనిపోయిన తర్వాత కూడా సేవ కొనసాగించారు. ఆయన కళ్లను డొనోట్ చేశాడు. ఆ విషయం బయటి ప్రపంచానికి ఆయన మృతి చెందిన తర్వాతే తెలిసింది. ఆయన మృతి తర్వాత ఆయన కళ్లను సేకరించిన వైధ్యులు ఆ కళ్లను ఇప్పటికే వేరే వాళ్లకు అమర్చడం కూడా జరిగిందట. తాజాగా పునీత్ రాజ్ కుమార్ గురించి మరో విషయం బయటకు వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 కోట్ల రూపాయలను ఆయన తన ఛారిటీ కోసం ఫిక్స్ డిపాజిట్ చేయడం జరిగిందట.
తాను ఉన్నా లేకున్నా.. తన ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఆ డబ్బుతో తాను మొదలు పెట్టిన ఛారిటీ కార్యక్రమాలు నిరంతరాయంగా జరుగుతూనే ఉండాలి అనేది ఆయన కోరిక. ఆయన ముందు చూపుకు అంతా హ్యాట్సాప్ అనాల్సిందే. ఎంతో మంది ఇండస్ట్రీలో ఉన్నారు. కాని ఏ ఒక్కరు కూడా ఛారిటీ పేరుతో కోట్ల రూపాయలు దానం చేస్తున్న దాఖలాలు లేవు. అప్పుడప్పుడు ఏదైనా విపత్తు వచ్చిన సమయంలో కొందరు సాయం చేసేందుకు ముందుకు వచ్చినా పునీత్ చేస్తున్న చారిటీ ముందు వారంత కూడా తర్వాతే అని అభిమానులు అంటున్నారు. పునీత్ రాజ్ కుమార్ రియల్ హీరో అనేందుకు ఇంతకు మించిన సాక్ష్యం ఏం కావాలంటే అభిమానులు ప్రశ్నిస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ వంటి హీరో మళ్లీ పుట్టే ఛాన్స్ లేదని.. ఆయన స్థాయిలో ఛారిటీ ఏ ఒక్కరు చేయరు అంటూ అభిమానులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.