Begin typing your search above and press return to search.

పునీత్ యాదిలో... గున్నేనుకు పవర్ స్టార్ పేరు

By:  Tupaki Desk   |   14 Nov 2021 1:42 AM GMT
పునీత్ యాదిలో... గున్నేనుకు పవర్ స్టార్ పేరు
X
ఒక మనిషిని వందేళ్లు గుర్తుంచుకోవడానికి... ఆ మనిషి వందేళ్లు బతకక్కర్లేదు.. ఒక్కరోజు చాలు. అతను సాధించిన విజయాలు అతన్ని వందేళ్లు బతికిస్తాయ్ అని విక్రమార్కుడు సినిమాలో రాజీవ్ కనకాల చెప్పిన డైలాగ్  ఇప్పటికీ మీకు గుర్తుండే ఉంటుంది. ఇలా కొంతమంది వారి చేసిన సేవా కార్యక్రమాలు, మంచి పనులతో  ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోతుంటారు. ఆ కీర్తే వారిని వందేళ్లకు మించి బతికిస్తుంది. వారు చనిపోయినా.. కానీ వారు పేరు మాత్రం వారిని కొలిచే ప్రజల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.

అలాంటి వారికి చనిపోయినా కానీ మరణం ఉండదు. చరిత్ర పుటల్లో చిరంజీవులుగా మిగిలిపోతారు. అలాంటి వ్యక్తుల్లో ఇటీవల మరణించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఒకరు. కేవలం నటుడు మాత్రమే గాక.. గొప్ప వ్యక్తిత్వం, సేవా గుణం ఉన్న వ్యక్తి  పునీత్ రాజ్ కుమార్. తాను వచ్చింది ఉన్నత కుటుంబం నుంచి అయినా చాలా డౌన్ టూ ఎర్త్ అనేలా ఉండే వ్యక్తి  పునీత్.

అటువంటి గొప్ప వ్యక్తి అయినటువంటి కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ పేరును పదే పదే తలుచుకునేలా కర్ణాటకలోని అటవీశాఖ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ఆ రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో సాక్రేబైలు అనే ఏనుగుల శిబిరం లో ఉండే ఒక చిన్న గున్న ఏనుగుకు పునీత్ రాజ్ కుమార్ అని పేరు పెట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ఇందుకు కారణం లేకపోలేదు. పునీత్ రాజ్ కుమార్ బతికుండగా ఈ ఏనుగుల శిబిరానికి ఓసారి వచ్చారు. డాక్యుమెంటరీ తీసేందుకు వచ్చిన ఆయన ఈ శిబిరంలో కొంత సమయం గడిపారు. ముఖ్యంగా పునీత్ రాజ్ కుమార్ గా నామకరణం చేసిన ఆ గున్న ఎనుగుతో ప్రత్యేకించి ఎక్కువ భాగం డాక్యుమెంటరీ షూట్ జరిగింది. ఈ సమయంలో ఆయన ఆ చిన్న ఏనుగు పిల్లలతో కలివిడిగా తిరిగారు. ఇది గమనించిన అధికారులు పవర్ స్టార్ మరణానంతరం ఆయనకు గుర్తుగా ఆ గున్న ఏనుగుకు ఆయన అని పేరు పెట్టారు.

సాధారణంగా అయితే ఏనుగులకు దేవతల పేర్లు లేక దేవుడి పేర్లు పెడుతుంటారు.  కానీ పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తి దేవుడితో సమానం అని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అందులోనూ పునీత్ ఈ శిబిరాన్ని సందర్శించినప్పుడు సుమారు మూడు గంటల పాటు ఆ గున్న ఏనుగు సంతోషంగా ఆడుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే పునీత్ రాజ్ కుమార్ లాంటి వ్యక్తి పేరును చిన్న ఏనుగుకు పెట్టే అదృష్టం రావడం పై అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పునీత్ రాజ్ కుమారు గత నెల 29 వ తేదీన జిమ్ చేస్తుండగా.. గుండె పోటు వచ్చింది. దీంతో  అక్కడికి అక్కడే కుప్పకూలిపోయారు. దీనిని గమనించి పనివారు ఆయనను వెంటనే స్థానికంగా ఉండే ఆసుపత్రికి తరలించారు.అప్పటికే గుండె పోటు కారణంగా చనిపోయారు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని అభిమానులు చనిపోయారు. ఏదేమైనా దిగ్గజ నటుడి పేరు...  గున్న ఏనుగకు పెట్టి మంచి పేరు చేశారని నెటిజన్లు హర్ష్యం వ్యక్తం చేస్తున్నారు.