Begin typing your search above and press return to search.
తీవ్ర విషాదం: కన్నడ పవర్ స్టార్ మృతి
By: Tupaki Desk | 29 Oct 2021 9:30 AM GMTసినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మృతి చెందారు. శుక్రవారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన పునీత్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్ చేస్తున్న సమయంలో పునీత్ కు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందించగా.. పరిస్థితి విషమించడంతో కన్నుమూశారు. గుండెపోటు కారణంగానే రాజ్ కుమార్ చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు.
పునీత్ రాజ్ కుమార్ వయసు 46. అగ్ర హీరో చిన్న వయసులోనే హార్ట్ ఎటాక్ తో కన్నుమూయడం అందరిని దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ ఇకలేరన్న వార్త విని ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. షాక్ కు గురైన సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కన్నడ పవర్ స్టార్ మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖులు చిరంజీవి - మహేష్ బాబు - రామ్ గోపాల్ వర్మ - మంచు విష్ణు - మంచు లక్ష్మి - నివేదా థామస్ - సోనూ సూద్ వంటి వారు సంతాపం వ్యక్తం చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ ఎస్ బొమ్మై. యష్ ఈరోజు ఉదయమే ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పునీత్ రాజ్ కుమార్ మృతితో కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించింది. ఆస్పత్రితో పాటు ప్రధాన మార్గాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పునీత్ ఇంటికి వెళ్లే మార్గాన్ని మూసివేశారు. సినిమా థియేటర్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశించింది.