Begin typing your search above and press return to search.
పాక్ నటుల నిషేదంపై కన్నడ పవర్ స్టార్..
By: Tupaki Desk | 15 Oct 2016 4:39 AM GMTఉరీలో భారత సైనిక శిబిరంపై పాక్ దాడికి ప్రతీకారంగా భారత సైన్యం పాక్ ఆక్రమిత ప్రాంతంలో ఉన్న ఉగ్రవాదుల శిబిరాలపై జరిపిన సర్జికల్ దాడులు అనంతరం ఒకపక్క దేశం మొత్తం అట్టుడికిపోతుంటే, మరోపక్క మహారాష్ట్ర నవనిర్మాణసేన బాలీవుడ్ పై దృష్టిసారించింది. బాలీవుడ్ లో ఉన్న పాకిస్థాన్ నటులకు అవకాశాలు ఇవ్వొద్దని - వారు షూటింగులను అడ్డుకుంటామని, పాక్ నటులు బయటకనిపిస్తే దాడులు చేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ నటులను బాలీవుడ్ సినిమాల్లో నిషేధించారు కూడా! ఈ విషయంపై రకరకాల అభిప్రాయాలు వచ్చాయి! కాగా ఈ విషయంపై తాజాగా శాండల్ వుడ్ నటీనటులు స్పందించారు.
బాలీవుడ్ పాకిస్థాన్ నటులను నిషేధించడాన్ని శాండల్ వుడ్ నటీనటులు సమర్థించారు. ఈ విషయంపై స్పందించిన కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్... "కళ కంటే దేశం చాలా గొప్పది.. ముందు మనమందరం భారతీయులం ఆ తరువాతే కళాకారులం.. పాకిస్థాన్ నటులను నిషేధించాలన్న డిమాండ్ సరైనదే" అని అన్నారు. ఇదే క్రమంలో... "దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతున్న భారత సైనికులకు ప్రతి ఒక్కరు మద్దుతుగా నిలబడాలని, ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే పాకిస్థాన్ నటీనటుల నిషేధించడం సబబేనని" డెరైక్టర్ పవన్ ఒడెయార్ చెప్పారు. ఇదే విషయంపై స్పందించిన ప్రముఖ హీరోయిన్ సంజన కూడా... "దేశం కంటే ముఖ్యమైనది ఏదీ లేదని.. పాకిస్థాన్ నటులపై నిషేధించడం ద్వారా భారత సైనికులకు మద్దతు తెలిపినట్లే అవుతుందని, అది మనందరి కర్తవ్యమని" ప్రకటించారు.
కాగా, పాకిస్థాన్ కళాకారులను నిషేదించడంపై బాలీవుడ్ లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. ఈ విషయాలపై పాక్ నటులను సమర్ధించి, వారిపై నిషేదాన్ని వ్యతిరేకించిన కరణ్ జోహార్ ఇప్పటికే దానికి సంబందించిన ప్రతిఫలాన్ని కూడా అనుభవించేస్తున్నాడు!!
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/