Begin typing your search above and press return to search.
పునీత్ సడెన్ డెత్.. డాక్లర్లు చెప్పిన షాకింగ్ నిజాలు
By: Tupaki Desk | 31 Oct 2021 7:53 AM GMTకన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ గుండె పోటుతో హఠాన్మరణానికి గురైన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం జిమ్ లో వర్కవుట్లు చేస్తుండగా కార్డియాక్ అరెస్ట్ కి గురై మరణించారు. దీంతో ఆరోగ్యం గా ఉన్న పునీత్ కి గుండెపోటు ఆకస్మికంగా ఎందుకని వచ్చింది? అంటూ డాక్టర్లు సైతం షాక్ అయ్యారు. పునీత్ మరణ వార్తను ఎవ్వరూ నమ్మలేకపోయారు. తాజాగా కార్డియాక్ అరెస్ట్ వెనుక ఆసక్తికర సంగతులే ఉన్నాయని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పునీత్ కి గురువారం రాత్రి నుంచే ఆరోగ్యం సరిగ్గా లేదని డాక్టర్లు తెలిపారు. అంటే రోజు ముందు నుంచే సింప్టమ్స్ బయటపడ్డాయనేదే దీనర్థం.
వైద్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా పునీత్ శుక్రవారం ఉదయం జిమ్ కి వెళ్లారు. ఓంట్లో నలతగా ఉన్నా పునీత్ వాటిని పట్టించుకోకుండా హెవీ వర్కౌట్లు చేసారు. ఆ కారణంగా ఒక్కసారిగా పునీత్ కార్డియాక్ అరెస్ట్ కి గురయ్యారు. అది తీవ్రమైన గుండె పోటుగా మారింది. ఒక్కసారిగా గుండె కొట్టుకోవడం మానేసి ఉండవచ్చు అని పునీత్ డాక్టర్ రాహుల్ ఎస్ పాటిల్ తెలిపారు. ఊపిరి తీసుకునే విషయంలో.. గుండెకి సంబంధించి ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే విశ్రాంతి తీసుకోవడం మంచిదని సూచించారు.
పరుగెత్తడం. .. వ్యాయామం చేయడం వంటికి గుండెకి అదనపు భారాన్ని మోపుతాయి. ఆ సమయంలోనే గుండె పనిచేయడం మానేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనికి వయసుతో సంబంధం లేదు. గుండెపై అదనపు భారం పడినప్పుడే ఇలా జరుగుతుందని కొన్ని నివేదికలు సైతం చెబుతున్నాయి. గుండె పోటు వచ్చే ముందు కొన్ని రకాల మార్పులు సైతం శరీరంలో చోటు చేసుకుంటాయి. 46 ఏళ్ల పునీత్ చిన్న వయసులో చనిపోవడానికి కారణం ఆరోగ్యంగా లేకపోయినా జిమ్ కి వెళ్లడమే ఆయన చేసిన తప్పిదంగా కనిపిస్తోంది. అయితే గ్లామర్ ప్రపంచంలో అజేయుడిగా పోటీతత్వంతో దూసుకెళ్లాలంటే స్టార్లు ఇలాంటి రిస్కులు చేయాల్సిందే. నిరంతరం వ్యాయామాన్ని నేటితరం స్టార్లు కోరుకుంటున్నారు.