Begin typing your search above and press return to search.
'వ్యాయామం లేని రోజు వృధా'.. వైరల్ అవుతున్న పునీత్ వీడియోలు..!
By: Tupaki Desk | 29 Oct 2021 2:26 PM GMTకన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడు, పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ శుక్రవారం కన్నుమూశారు. 46ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. అప్పూ ఇక లేడన్న విషయం ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది.
ఉదయం తన సోదరుడు శివ రాజ్ కుమార్ సినిమా 'భజరంగి 2' విడుదల సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన పునీత్.. ఇంట్లోని జిమ్ లో వర్కవుట్స్ చేస్తుండగా 9.45 గంటల సమయంలో గుండెపోటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ముందుగా పునీత్ ని సమీపంలోని రమణశ్రీ ఆసుపత్రికి తరలించగా.. కార్డియాక్ అరెస్టుగా వైద్యులు నిర్ధారించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విక్రమ్ హాస్పిటల్ కు తరలించి ఐసీయూలో చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో పునీత్ తుదిశ్వాస విడిచారు.
పునీత్ రాజ్ కుమార్ బాడీ ఫిట్నెస్ మీద స్పెషల్ కేర్ తీసుకుంటారు. జిమ్ లో వర్కవుట్స్ చేయడాన్ని అమితంగా ఇష్టపడే పవర్ స్టార్.. క్రమం తప్పకుండా వ్యాయామాలు చేస్తుంటారు. సినిమా షూటింగ్ లతో ఎంత బిజీగా ఉన్నా ఎక్సర్సైజులు చేయడం ఆయన ఎప్పుడూ మానలేదు. నాలుగు పదుల వయసులో కూడా యంగ్ గా కనిపించడానికి పునీత్ చేసే కఠిన వర్కౌట్స్ కారణమని అభిమానులు చెబుతూ ఉంటారు.
పునీత్ జిమ్ లో వ్యాయామం చేసే వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. సినిమాల్లో కష్టతరమైన స్టెప్పులను ఎంత సింపుల్ గా చేస్తారో.. జిమ్ లో అలానే విన్యాసాలు చేస్తుంటారు. అందుకే సినిమాల్లో డూప్స్ లేకుండానే స్టంట్స్ చేయడానికి ఇష్టపడతారు. అయితే ఇప్పుడు జిమ్ లో వ్యాయామం చేస్తున్నప్పుడే పునీత్ కు హార్ట్ ఎటాక్ అవడం అభిమానుల మనసుని కలిచి వేస్తోంది.
ఈ నేపథ్యంలో పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వ్యాయామాలు చేసిన వీడియోల కోసం అభిమానులు నెట్ లో వెతుకుతూ ఆయన్ని గుర్తు చేసుకుంటున్నారు. ''వర్కవుట్ లేని రోజు వృధా అయినట్లే'' అని పునీత్ పోస్ట్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. అలానే పునీత్ ఆబ్స్ - పుష్ ఆప్స్ చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే పునీత్ రాజ్ కుమార్ కేవలం ఒక మంచి నటుడిగానే కాకుండా మంచి మనసున్న వ్యక్తిగా అభిమానుల్లో చెరగని ముద్రవేసుకున్నారు. పునీత్ ను కలవడానికి వచ్చిన అభిమానులతో కలిసి భోజనం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలానే ఫ్రీ స్కూల్స్ - అనాధాశ్రమలు - వృధాశ్రమాలు - గోశాలలు నిర్మించారు. ఏంతో మంచి పేద విద్యార్థులకు చదువులు చెప్పించారు. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
అందుకే పునీత్ ని అందరూ ఎంతగానో ఇష్టపడతారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అతని గొప్పతనం. చివరకు చనిపోయిన తర్వాత కూడా తన రెండు కళ్లు దానం చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నారు.. అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.