Begin typing your search above and press return to search.
తెలుగు పేర్లే ఎక్కువ వినబడుతున్నాయ్..
By: Tupaki Desk | 10 Aug 2016 4:27 AM GMTపోస్టర్ మీద పేరు మాత్రమే చూసి అది ఏ భాషా చెప్పడం కాస్త కష్టం.. గతంలో టాలీవుడ్ సినిమా పేర్ల పరిస్థితి ఇలానే వుండేది. కాన్సెప్ట్ ఏదైనా సరే ఆంగ్ల మాధ్యమంలో పేర్లు పెడితే ప్రేక్షకులు త్వరగా కనెక్ట్ అవుతారన్న భావన తరచూ రుజువు చేసేది.
అయితే ఇప్పుడు ట్రెండ్ మారింది. తెలుగు సినిమాలకు తెలుగు పేర్లనే దర్శక నిర్మాతలు ప్రిఫర్ చేస్తున్నారు. బడా స్టార్ హీరోల సినిమాల నుండీ చోటా బడ్జెట్ చిత్రాల దాకా అధిక శాతం తెలుగు సినిమా పేర్లే వినిపిస్తున్నాయి. ఈ జాబితాలో బ్రహ్మోత్సవం, శతమానం భవతి, శ్రీరస్తు.. శుభమస్తు లాంటి అచ్చ తెలుగు పేర్లు కూడా వుండడం విశేషం.
చిరు 150వ సినిమాకు కత్తిలాంటోడు అనుకుంటూ వుంటే బాలయ్య 100కి గౌతమీ పుత్ర శాతకర్ణి ఫిక్స్ అయ్యాడు. ఇండియా బిగ్గెస్ట్ గ్రాసర్ బాహుబలి కూడా మన పేరే కావడం విశేషం. త్వరలో రాబోతున్న సినిమాలు కూడా ఆకతాయి, అలకనంద, చీకటి ప్రేమకథ, ధైర్యే సాహసే లక్ష్మి లాంటి తెలుగు పేర్లే రిజిస్టర్ కావడం ఆనందకరం.