Begin typing your search above and press return to search.

దేశం దాటిన పూరి..JGM లో అంతుందా?

By:  Tupaki Desk   |   6 Jun 2022 11:30 PM GMT
దేశం దాటిన పూరి..JGM లో అంతుందా?
X
తెలుగు సినిమా రేంజ్ మారిందిప్పుడు. టాలీవుడ్ సినిమా అంటే పాన్ ఇండియా లో మార్మోగాల్సిందే. ఇంకా రేంజ్ ఉంటే గ్లోబ‌ల్ స్థాయిలో ఫేమ‌స్ అవ్వాల్సిందే. తెలుగు సినిమా ఖ్యాతి విశ్వ‌వ్యాప్త‌మైన త‌రుణం ఇది. ఆ ఇమేజ్ ని కాపాడుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తీ మేక‌ర్ పైనా ఉంద‌న్న‌ది వాస్త‌వం . సుకుమార్..రామౌళి..ప్ర‌శాంత్ నీల్ లాంటి వారు యూనివ‌ర్శ‌ల్ కంటెంట్ తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డ‌మే అందుకు ఆద్యం పోసింది.

కంటెంట్ తో పాటు సాంకేతికంగానూ సినిమాను ఉన్న‌త స్థాయి ప్ర‌మాణాల‌తో చూపించడానికి ఎంతో త‌పిస్తున్నారు. అస‌లైన ఇండియ‌న్ సినిమా అంటే ఇది అని ప్ర‌పంచ స్థాయిలో చాటి చెప్ప‌డానికి ఎంతో కృషి చేస్తున్నారు. మ‌రి ఇప్పుడు కోవ‌లో డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాధ్ ని కూడా చేర్చాల్సి ఉంటుందా? పూరి పాన్ ఇండియా మేక‌ర్ గా వెలుగెత్తి చాట‌గ‌ల‌రా? పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ద్వారానే అది సాధ్య‌మ‌వుతుందా? ఆ ర‌కమైన ప్ర‌ణాళిక‌లతో ముందుకు క‌దులుతున్నారా? అంటే అవున‌నే సంకేతాలు అందుతున్నాయి.

ప్ర‌స్తుతం పూరి- విజ‌య్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా 'జ‌న‌గ‌ణ‌మ‌న' తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. 'జెజీఎమ్' పూరిక‌న్న క‌ల‌. సినిమా ప్రపంచంలోకి వ‌చ్చిన‌ప్ప‌టిటి నుంచి జెజీఎమ్ తెర‌కెక్కించాల‌ని క‌లగంటున్నారు. తన డ్రీమ్ ని సూప‌ర్ స్టార్ మ‌హేష్ ద్వారా పుల్ ఫిల్ చేయాల‌నుకున్నారు. కానీ అది సాధ్య ప‌డ‌క పోయేస‌రికి ఆ స్థానంలోకి విజ‌య్ ని తీసుకొచ్చి అంతే రెట్టించిన ఉత్సాహంతో టేక‌ప్ చేసి ముందుకు వెళ్తున్నారు.

ఇది ఆర్మీ బ్యాక్ డ్రాప్ వార్ స్టోరీ. క‌శ్మీర్ నేప‌థ్యం ఎక్కువ‌గా ఉంటుంది. పూరి క‌లం నుంచి పురుడు పోసుకున్న స‌రికొత్త క‌థ‌. 'పోకిరి' మార్క్ స్ర్కీన్ ప్లే తో 'జ‌న‌గ‌ణ‌మ‌న' ఉండ‌బోతుంద‌న్న‌ది సుస్ప‌ష్టం. ఈ సినిమాతో స‌రికొత్త పూరిని ఆవిష్క‌రించ‌నున్నార‌ని ప్ర‌చారం సాగుతుంది. కొన్నాళ్ల‌గా ఒకే జాన‌ర్ కి అల‌వాటు ప‌డిపోయిన పూరి ఈ సినిమాతో రిమార్క్స్ తొల‌గించుకుని కొత్త పూరిని ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచయం చేయ‌బోతున్నాడ‌ని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తుంది.

మరి ఈ ప్రెస్టీజియ‌స్ ప్రాజెక్ట్ కోసం పూరి తొలిసారి దేశం దాట‌బోతున్నారా? విదేశీ టెక్నీషియ‌న్ల‌ని రంగంలో కి దించుతున్నారా? అంటే అవున‌నే తెలుస్తోంది. 'జెజీఎమ్' విజువల్ వండ‌ర్ గా హైలైట్ చేయ‌బోతున్నారు. దీనిలో భాగంగా కొంత మంది విదేశీ స్టంట్ మాస్ట‌ర్ల‌ని రంగంలోకి దించ‌తున్నారుట‌. సినిమాలో విఎఫ్ ఎక్స్ హైలైట్ అయ్యేలా టెక్నిక‌ల్ దిగ్గ‌జాల్ని రంగంలోకి దించుతున్నారుట‌.

ఆర్మీ వార్ స‌న్నివేశాలు హైలైట్ అయ్యేలా ప్ర‌జెంటేష‌న్ ఉండాలంటే విదేశీ నిపుణుల‌తో మాత్ర‌మే సాధ్య‌మ‌వుతుంద‌ని భావించి వాళ్ల‌ని సీన్ లోకి తీసుకొస్తున్న‌ట్లు తెలుస్తోంది. గ‌తంలో రాజ‌మౌళి...నాగ్ అశ్విన్ తో పాటు కొంత మంది బాలీవుడ్ మేక‌ర్స్ మాత్ర‌మే విదేశీ నిపుణుల‌తో ప‌ని చేయించుకున్నారు.

ఇప్పుడు వాళ్ల స‌ర‌స‌న పూరి చేర‌బోతున్నారు. వాస్త‌వానికి పూరి గ‌తంలో రెండు సినిమాల విష‌యంలో విదేశీ నిపుణుల్ని తీసుకొచ్చారు గానీ..వాళ్ల ప‌రిజ్ఞానాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోలేదు. కానీ ఈసారి పూరి వాడ‌కం ఎలా ఉండ‌బోతుందో ఊహించొచ్చు.