Begin typing your search above and press return to search.
మైండ్ గేమ్ షురూ! అట్నుంచి నరుక్కొస్తున్న పూరి?
By: Tupaki Desk | 23 Dec 2022 3:50 AM GMTఐ బిలీవ్ ఇన్ వార్.. నాట్ ఇన్ మోరాలిటీ.. యుద్ధం చేతకాని వాడే ధర్మం గురించి మాట్లాడుతాడు!! .. ఈ డైలాగ్ రాసింది పూరి. ఇప్పుడు పూరి ధర్మం గురించి మాట్లాడే పరిస్థితిలో లేడు. లేడిని పులి చంపిందని జాలిపడే ఈ మానవ ప్రపంచం టన్నుల కొద్దీ కోళ్లను రోజూ కోసుకుని తినేస్తోంది. ఇప్పుడు పూరీని లోకం ఇంకా అలానే చూస్తోంది. అతడు ఫ్లాపుల్లో ఉన్నాడని ఏమాత్రం ఈ ప్రజలకు ఏమాత్రం కనికరం లేదు.
అతడి అనుభవాల నుంచి దూసుకొచ్చే ప్రతి డైలాగ్ ఒక్కో బుల్లెట్టు లాంటిది. కానీ ఆ డైలాగులు సినిమాల వరకేనా? ఇప్పుడు కెరీర్ ని ట్రాక్ లోకి తెచ్చేందుకు ఉపయోగపడతాయా? అంటూ ఈ మానవ ప్రపంచం అతడి డైలాగుల్ని అతడిపైకే ప్రయోగిస్తోంది. 'లైగర్' డిజాస్టర్ తో పాన్ ఇండియా లెవల్లో పూరికి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏదో ఆశిస్తే ఇంకేదో అయ్యిందని విమర్శలొచ్చాయి. అయితే ఇప్పుడు అతడు దీని నుంచి బయటపడేందుకు అదిరిపోయే మాస్టర్ ప్లాన్ తో ముందుకు రావాల్సి ఉండగా.. దానిని పర్ఫెక్ట్ లెంగ్త్ తో ఎగ్జిక్యూట్ చేస్తున్నాడని తెలిసింది.
దానికి తగ్గట్టే కొడ్తే ఈసారి కుంభాన్నే కొట్టాలి అన్నట్టుగా ఉంది పూరి ప్లాన్. బాక్సాఫీస్ వద్ద లైగర్ ఘోరమైన ప్రదర్శన తరువాత పూరి జగన్నాధ్ ఒక ప్రాజెక్ట్ కోసం సల్మాన్ ఖాన్ ను సంప్రదించాడనేది ఇన్ సైడ్ టాక్. తాజా డిజాస్టర్ తర్వాత తెలుగు - హిందీ బెల్ట్ లో వేరొక హీరో ఎవరూ అతడి జోలికి వెళ్లడం లేదు. అయినా పూరి మైండ్ గేమ్ ఇప్పుడు బాలీవుడ్ లోనే కంటిన్యూ చేయబోతున్నాడు. అంతేకాదు అక్కడ సల్మాన్ భాయ్ ని లాక్ చేయాలని ప్రయత్నిస్తున్నాడని సమాచారం.
ఇంతకీ పూరి వినిపించే స్క్రిప్ట్ ని సల్మాన్ వింటాడా? అంటే అతడి వద్ద ఆమాత్రం గౌరవం ఉంది. పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ ని వాంటెడ్ గా సల్మాన్ రీమేక్ చేశాడు కాబట్టి ఆ గౌరవం అభిమానం అతడిపై పని చేస్తాయనేది పూరి నమ్మకం.
దానిని నిజం చేస్తూ ఇప్పుడు సల్మాన్ భాయ్ పూరి స్క్రిప్ట్ ను వినడమే కాకుండా మాట కూడా ఇచ్చేశాడని గుసగుస వినిపిస్తోంది. అయితే తదుపరి ఫార్మాలిటీస్ పై ఇంకా పని చేయాల్సి ఉంది. కానీ భాయ్ సూత్రప్రాయంగా అంగీకరించారని ఫిలింనగర్ వర్గాల ద్వారా వెల్లడైంది.
సల్మాన్ ఖాన్ కోసం పూరి ఎలాంటి కథను ఎంపిక చేసుకుంటాడు? అంటే.. ఈ చిత్రం అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని కూడా గుసగుస వినిపిస్తోంది. ప్రస్తుతానికి దేవరకొండతో లైగర్ సీక్వెల్ ఊసెత్తలేదు. ఇప్పట్లో దాని గురించి వినపడదు అని కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అమితాబ్ కి బుడ్డా హోగా తేరా బాప్ లాంటి హిట్టిచ్చిన పూరి ఇప్పుడు సల్మాన్ భాయ్ కి కూడా మరో వాంటెడ్ లాంటి హిట్టిచ్చి హిందీ పరిశ్రమలో మోస్ట్ వాంటెడ్ గా మారతాడేమో చూడాలి. అట్నుంచి నరుక్కొస్తే మన హీరోలు తిరిగి దారికొస్తారనే వ్యూహం ఫలించేందుకు వీలుంటుంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.