Begin typing your search above and press return to search.

ఏంజెలీనా జోలి బెడ్ పై కాసేపు కూచుని..!

By:  Tupaki Desk   |   16 May 2021 1:30 PM GMT
ఏంజెలీనా జోలి బెడ్ పై కాసేపు కూచుని..!
X
టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇటీవ‌ల వ‌రుస పాడ్ కాస్టింగ్స్ మ్యూజింగ్స్ తో అభిమానుల‌కు బోలెడంత వినోదాన్ని విజ్ఞానాన్ని పంచుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఎన్నో టాపిక్ ల‌పై ఆయ‌న అద్భుత‌మైన స్పీచ్ లు ఆక‌ట్టుకున్నాయి. తాజాగా ఏంజెలినా జోలీపైనా వెనిస్ న‌గ‌రంపైనా ఆయ‌న అభిమానం బ‌య‌ట‌పెడుతూ చేసిన మ్యూజింగ్ అభిమానుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

``వ‌ర‌ల్డ్ లోనే అంద‌మైన న‌గ‌రాల్లో వెన్నిస్ ఒక‌టి. దీన్ని వెన్నిసియా అని కూడా అంటారు. ఇట‌లీ నార్త్ ఈస్ట్ సిటీ. బి.సి ప‌దో సెంచ‌రీలో క‌ట్టారు. 118 ద్వీపాలుంటాయి. వాటి మీద వెన్నిస్ సిటీని నిర్మించారు. ప్ర‌తి ద్వీపానికి కాలువ‌ను క‌ట్టి వాటిని క‌నెక్ట్ చేస్తూ 400 బ్రిడ్జిల‌ను క‌ట్టారు. ఈ సిటీలో కార్లు బైకులు ఉండ‌వు. ఓ ఇంటి నుంచి మ‌రో ఇంటికి వెళ్లాలంటే గండోలా అనే అంద‌మైన‌ ప‌డ‌వ వేసుకుని వెళ్లాల్సిందే. న‌గ‌రంలో అణువ‌ణువు అందంగా ఉంటాయి. దీపాలు.. బెంచీలు.. అఖ‌రికి డ‌స్ట్ బిన్స్ కూడా అందంగా డిజైన్ చేయ‌బ‌డి ఉంటాయి.`` అని చాలా సంగ‌తులే తెలిపారు.

మార్కోపొలో అనే ర‌చ‌యిత ఈ న‌గ‌రానికి చెందిన‌వాడే. వెనిస్ కార్నివాల్ అతి పండ‌గ రోజున అంద‌రూ ఫేస్ మాస్క్ వేసుకుని వ‌స్తారని పూరి తెలిపారు. ప్ర‌పంచంలో మొద‌టి క్యాసినో ఇక్క‌డే ప్రారంభ‌మైంది. అలాగే ప్ర‌పంచంలో మొద‌టి గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన అమ్మాయి కూడా ఇక్క‌డి నుంచే ఉన్నార‌ట‌. గ్రాండ్ కెనాల్ న‌గ‌రాన్ని విభ‌జిస్తుంద‌ని న‌గ‌రంలో నిత్యం వాయిద్యాలు వినిపిస్తాని వెల్ల‌డించారు.

ఇక ప్ర‌ఖ్యాత హాలీవుడ్ క‌థానాయిక ఏంజెలినా జోలీ అక్క‌డ డానియేలి అనే పాపుల‌ర్ హోట‌ల్ లో రూమ్ ఖాళీ చేసి వెళ్లింద‌ట‌. షూటింగ్ పేరుతో అబ‌ద్ధం చెప్పి ఆ హోట‌ల్ రూమ్ లో ఏంజెలినా ఉన్న బెడ్ పై కాసేపు కూచుని గడిపి వ‌చ్చార‌ట‌.. అదోర‌కం సంతృప్తి అని అన్నారు.

వెన్నిస్ న‌గ‌రం రోజు రోజుకీ మున‌గిపోతుంద‌ని 2030నాటికి ఈ న‌గ‌రం స‌గం మునిగిపోయి ఘోస్ట్ సిటీ అవుతుంద‌ని చెబుతున్నారు. అది నిజ‌మో కాదో తెలియ‌దు. వీలైతే వెన్నిస్ ను ఓసారి చూసి రండి అని సూచించారు. పూరి తెర‌కెక్కిస్తున్న లైగ‌ర్ చిత్రానికి సెకండ్ వేవ్ వ‌ల్ల బ్రేక్ ప‌డిన సంగ‌తి తెలిసిందే.