Begin typing your search above and press return to search.
హీరోయిన్లని దేవతలతో పోల్చిన పూరి!
By: Tupaki Desk | 30 Jun 2022 2:30 AM GMTఅభిమానుల దృష్టిలో హీరోయిన్లు అంటే దేవతలు. ఆ రకంగానే అందమైన హీరోయిన్లని అభిమానులు కొలుస్తారు. అభిమానిస్తారు..ఆరాధిస్తారు. తెరపై కనిపించే అందానికి మాత్రమే దక్కే అదృష్టం ఇది. తెర వెనుక ఎన్నో అందాలుంటాయి. కానీ తెరపై కనిపించే అందం ఎప్పుడూ ప్రత్యేకమే. సినిమా వాళ్లని ఎందుకంతగా అభిమానిస్తారంటే? కారణం కేవలం తెర తెచ్చిన వన్నె మాత్రమే.
మరి అలాంటి అందమైన హీరోయిన్లు పెళ్లి చేసుకుని గర్భందాల్చడం..అటుపై తొమ్మిది నెలలు నిండిన తర్వాత పురిట నొప్పులు పడితే చూస్తూ తట్టుకోగలమా? అంటే నా వల్ల కాదంటున్నారు డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. పూరి పెళ్లి గురించి చెబుతోన్న ఫిలాసఫీ గురించి తెలిసిందే. ఇప్పటికే అబ్బాయిల పెళ్లిళ గురించి మాట్లాడారు.
అటుపై అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకోకుండానే తమ డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకోమన్నారు. చివరికి పూరి తెరపై కనిపించే హీరోయిన్లపైనా పడ్డట్లు తెలుస్తోంది. సినిమా హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకోవడం నాకెందుకో ఇష్టం ఉండదు. ఎందుకంటే కోటి మందిలో ఒక్కరికి మాత్రమే హీరోయిన్ అవకాశం వస్తుంది. వాళ్లు చాలా స్పెషల్.
వాళ్లు కూడా అందరిలాగే పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోతే ఎలా? అభిమానులు దేవతల్లా చూస్తారు. మీ ముఖాలు గల ఫోటోలు గొడలకి అంటిస్తారు. ఫోన్లలో స్ర్కీన్ సేవర్ గా పెట్టుకుంటారు. అలాంటి దేవతలు మెటర్నిటీ వార్డులో పురిట నొప్పులు పడుతుంటే చూడలేను. మనందరం పూజించే లక్ష్మీ..పార్వతి..సరస్వతి ఎవ్వరూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలి అన్న కోరిక మానవులుకు ఉంటుంది. దేవతలకి ఉండదు అని తనదైన లాజిక్ వెదికారు పూరి.
మొత్తానికి పూరి ప్రపంచంలో అబ్బాయిలు .. డ్రీమ్స్ ఉన్న అమ్మాయిలు..అందమైన హీరోయిన్లు పెళ్లి చేసుకోకూడదని బలంగా సంకల్పించినట్లు కనిపిస్తుంది. జీవితాన్ని..ప్రపంచాన్ని చూడాలంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోకుండానే ప్రపంచాన్ని చుట్టేయాలి. అమ్మాయిలు లక్ష్యాన్ని చేరుకోవాలి. హీరోయిన్లు పురిట నొప్పుల నుంచి తప్పించుకోవాలంటే పూరి చెప్పినట్లు చేయాలి.
పూరి వ్యాఖ్యలు కొందర్ని చాలా బలంగా ఇన్ స్పైర్ చేస్తుంటాయని సోషల్ మీడియా వేదికగా అభిమానులు చెబుతుంటారు. అదే తీరున దర్శకుడు వి.వి వినాయక్ కూడా పూరి గురించి అంతే గొప్పగా చెబుతారు. బ్రతికితే ఒక్క రోజైనా పూరి లా బ్రతకాలంటుంటారు. ఇంత వరకూ పూరి లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని చూడలేదని వినాయక్ చెబుతుంటారు.