Begin typing your search above and press return to search.
JGM హీరో పూరి రియల్ లైఫ్ రోల్!
By: Tupaki Desk | 8 Aug 2022 5:50 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కథలు..అందులో పాత్రలు..హీరో రోల్ ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో? చెప్పాల్సిన పనిలేదు. పూరి తొలి సినిమా `బద్రీ` దగ్గర నుంచి `ఇస్మార్ట్ శంకర్` వరకూ హీరో రోల్స్ ఎనర్జిటిక్ గా సాగిపోతాయి. ఆ రోల్ కి ధీటుగానే విలన్ పాత్ర ని సైతం బలంగా తీర్చిదిద్దడం పూరి ప్రత్యేకత. ఇక వ్యక్తిగతంగానూ పూరి సినిమాల్లో తన అభిప్రాయాల్ని సైతం చెప్పే ప్రయత్నం చేస్తుంటారు.
సందేశాలిస్తే ఎవరూ తీసుకోరు? కాబట్టి..సినిమా రూపంలో తాను చెప్పాలనుకున్నది ఎంటర్ టైనింగ్ యాంగిల్ లో చెబుతుంటారు. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో పూరి సైతం రివీల్ చేసారు. కూర్చోబెట్టి క్లాస్ లు పీకితే ఎవడు వింటాడు? నువ్వు ఎవడు? నాకు చెప్పడానికి దొబ్బెయ్ అంటారు. వాటిని సినిమా రూపంలో చెబితే జనాలు ఎగబడి చూస్తారు.
వాటిలో మంచిని గ్రహించరు గానీ..చెడును మాత్రం ఈజీగా గ్రహిస్తారని పరోక్షంగా సమాజంపై చాలాసార్లు సెటైర్లు వేసారు పూరి . మనుషులు..వ్యక్తిత్వాలు..సమాజాన్ని ఉద్దేశించే పూరి ఓ ట్యూబ్ ఛానెల్ లాంచ్ చేసి అందులో పూరి మ్యూజింగ్స్ పేరుతో క్లాసులు తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. మనిషి జీవితానికి సంబంధించిన తన భావాల్ని అంటిన్నింటిని పూరి ఎంతో ఓపెన్ గా పంచుకుంటున్నారు.
ఇదంతా పూరి ఇజంగా జనాల్లోకి వెళ్తోంది. మరి పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ `జేజీఎమ్` కథ ఇలాంటి అంశాలతోనే ముడిపడి ఉందా? అందులో హీరో పాత్ర పూరి రియల్ లైఫ్ పాత్రకు దగ్గరగా ఉంటుందా? అందుకే పూరి దీన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ గా ప్రకటించారా? అంటే అవుననే టాక్ వినిపిస్తుంది. పూరి ఇజానికి హీరో పాత్ర నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అంటున్నారు.
పూరి జీవితంలో ప్రతీ కోణాన్ని `జేజీఎమ్` లో ఆవిష్కరించబోతున్నట్లు ఇన్ సైడ్ ప్రచారం సాగుతుంది. ఓవైపు సీరియస్ గా హీరో పాత్ర సైనిక అధికారిగా కనిపిస్తూనే మరోవైపు సోసైటీ తీరును ప్రశ్నించేలా? పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. ప్రజాస్వామ్యం రద్దయినప్పుడు పాలన మిలటరీ చేతుల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? అన్న పాయింట్ ని ప్రధానంగా హైలైట్ చేయబోతన్నారుట.
దీంతో మల్టీ టాపిక్స్ `జేజీఎమ్` లో డిస్కస్ చేయడానికి ఛాన్స్ ఉంది. అది గనుక సక్సస్ అయితే జేజీఎమ్ ప్రాంచైజీ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో `లైగర్` తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా నాలుగు రోజులే సమయం ఉండటంతో టీమ్ అంతా ప్రచారం పనుల్లో బిజీగా ఉన్నారు.