Begin typing your search above and press return to search.

రొమాంటిక్ కు పూరి ఇస్మార్ట్ టచ్ ఇచ్చారా?

By:  Tupaki Desk   |   23 Dec 2019 6:55 AM GMT
రొమాంటిక్ కు పూరి ఇస్మార్ట్ టచ్ ఇచ్చారా?
X
పూరి జగన్నాధ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా నటిస్తున్న 'రొమాంటిక్' సినిమా ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. రెండురోజుల క్రితమే ఒక రొమాంటిక్ సాంగ్ విడుదల చేశారు. నువ్వు నేను ఈ క్షణం అంటూ సాగే ఈ పాట రొమాంటిక్ గా కాదు.. ఎరోటిక్ గా ఉందని కామెంట్లు వినిపించాయి. ఇక ఈ పాటకు ఇచ్చిన వాయిస్ ఓవర్ డైలాగ్స్ యమా బోల్డ్ గా ఉన్నాయి. విజువల్స్ సంగతి ఇక చెప్పనవసరం లేదు.. ప్రతి ఫ్రేమ్ లోనూ పూరి మార్క్ కనిపించింది.

అయితే ఈ సినిమాకు దర్శకుడు అనిల్ పాడూరి. పూరి కథ అందించారు.. సినిమా ను నిర్మిస్తున్నారు. అయినా విజువల్స్ లో మాత్రం పూరి స్టైల్ రొమాన్స్ కనిపిస్తోంది.. సినిమా కూడా కాస్త బోల్డ్ గా పూరి సినిమాల తరహాలో ఉండబోతోందనే విషయం ఈ పాట చూసిన ప్రతి ఒక్కరికీ అర్థం అయింది. కేతిక శర్మ అయితే ఈ పాటలో గ్లామర్ హద్దులను పూర్తిగా చెరిపేస్తూ రెచ్చిపోయింది. ఈమధ్య టాలీవుడ్ లో ఇంత బోల్డ్ నెస్ చూపించిన హీరోయిన్ ఎవరూ లేరనడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఆరెక్స్ భామ పాయల్ ను మించిన బోల్డ్ నెస్ చూపిస్తూ కేతిక యూత్ కు గాలం వేసింది.

'రొమాంటిక్' సినిమాను ప్రారంభించినప్పుడు పెద్దగా ఎవరూ పట్టించుకో లేదు కానీ ఘాటు పోస్టర్లు... ఈ రొమాంటిక్ సాంగ్ తో ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమాపై పడింది. రాబోయే ప్రోమోస్.. సినిమా టీజర్.. ట్రైలర్లు ఇంకెంత సంచలనం సృష్టిస్తాయో వేచి చూడాలి. ఈ సినిమాను పూరి కనెక్ట్స్.. పూరి జగన్నాధ్ టూరింగ్ టాకీస్ బ్యానర్లపై పూరి - ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.