Begin typing your search above and press return to search.
హీరోలతో తన సీక్రెట్స్ ను రివీల్ చేసిన పూరీ!
By: Tupaki Desk | 22 July 2019 10:23 AM GMTహిట్ కోసం తపించిన పూరీకి ఇస్మార్ట్ శంకర్ రూపంలో సక్సెస్ సొంతం చేసుకున్నాడు. ఇలాంటి రోజు కోసం ఎంతగానే తపిస్తున్న ఆయన.. ఇప్పుడు విజయాన్ని ఎంజాయ్ చేస్తూ ఆస్వాదిస్తున్నారు. ఇస్మార్ట్ ప్రమోషన్లో భాగంగా పలు మీడియా సంస్థలకు వరుసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు పూరీ.
తాజాగా ఒక మీడియా సంస్థకు కాస్తంత వెరైటీ ఇంటర్వ్యూ ఇచ్చారాయన. తాను కలిసి పని చేసిన హీరోలకు సంబంధించి ఇప్పటివరకూ రివీల్ కాని సీక్రెట్స్ ను ఆయన వెల్లడించారు. పూరీ వెల్లడించిన విషయాలు కొన్ని సంచలనంగా మారాయి. ఇంతకీ ఆయన చెప్పిన ఆ రహస్యల్ని ఆయన మాటల్లోనే చూస్తే..
ఆయా హీరోల గురించి ఆయన మాటల్లోనే చెబితే..
ఇస్మార్ట్ శంకర్
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండను సంప్రదించామనటం తప్పు. ఆ మాటలో నిజం లేదు. రామ్ ను కలిసినప్పుడు నా దగ్గర కథ కూడా లేదు. ఒక బ్యాడ్ బ్యాయ్ కథ రెఢీ చేయమని రామ్ చెప్పాడు. దీంతో ఈ కథ సిద్ధం చేశా.
రామ్
వాడుకున్నోడికి వాడుకున్నంత. ఆయనలో చాలా టాలెంట్ ఉంది. వెరీ గుడ్ యాక్టర్. డ్యాన్సర్. ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి.
తారక్
టెంపర్ సినిమా షూటింగ్ ఎక్కువగా గోవాలో జరిగింది. షూటింగ్ అయ్యాక తారక్ కారు ఎక్కించుకొని అలా బయటకు తీసుకెళ్లేవారు. కారు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ మామూలుగా ఉండేది కాదు. వందకు పైగా స్పీడ్ తో దూసుకెళ్లేవాడు. ఎవరు చెప్పినా వినేవాడు కాదు. తారక్ కు మరో అలవాటు.. తానే వండి పెట్టటం. చాలా రకాలు వండేవాడు.
అల్లు అర్జున్
దేశముదురు చిత్రం కోసం 40 రోజులు కులుమనాలిలో షూట్ చేశాం. షూట్ అయ్యాక టీం మొత్తం తింటూ ఎంజాయ్ చేస్తే.. బన్నీ మాత్రం ఎక్సర్ సైజులు చేసేవారు. మేమంతా చలికి తట్టుకోలేక బెడ్ షీట్స్ ఫుల్ గా కప్పుకుంటే.. అతను మాత్రం షర్ట్ లేకుండా డిప్స్ తీసేవాడు.
రవితేజ
ఇడియట్ మూవీ షూటింగ్ గోలగోలగా ఉండేది. రవితేజ.. రక్షిత ఇద్దరూ బూతులు తిట్టుకుంటూ కొట్టుకునేవారు. అలా వారు కొట్టుకునే టైంలోనే రొమాంటిక్ సాంగ్ తీయాల్సి వచ్చేది. విడిగా ఎలా ఉన్నా.. షూటింగ్ టైంకి మాత్రం పాత్రల్లో లీనమయ్యేవారు. సాంగ్ షూట్ లో మాత్రం రొమాంటిక్ గా యాక్ట్ చేసేవారు.
పవన్ కల్యాణ్
బద్రి కథ చెప్పినప్పుడు కథ బాగా నచ్చింది.. క్లైమాక్స్ నచ్చలేదన్నారు. క్లైమాక్స్ లో ఫైట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారేమో అనుకొని తర్వాత కథ మార్చి రాశా. కానీ అది నాకే నచ్చలేదు. దీంతో.. మళ్లీ వెళ్లి పవన్ కు పాత కథే చెప్పా. ఇంది ఇంతకు ముందు చెప్పిన క్లైమాక్సే కదా అన్నారు. మీరు ఇంతకు ముందు సరిగ్గా విన్నారో లేదో? అందుకే మళ్లీ చెబుతున్నా అని చెప్పా. నాకు కూడా ఇదే క్లైమాక్స్ నచ్చింది. నేను అడిగితే నువ్వు మారుస్తావో లేదోనని చెక్ చేశానన్నారు. ఆ టైంలో క్లైమాక్స్ మార్చి ఉంటే పవన్ దగ్గర నా క్యారెక్టర్ దెబ్బ తిని ఉండేది.
రామ్ చరణ్
చిరుత షూటింగ్ మొదట బ్యాంకాక్ లో రామ్ చరణ్ తో పాట ప్లాన్ చేశా. ఐల్యాండ్ లో షూట్ చేస్తుంటే ఆ వేడికి చరణ్ చర్మం నల్లగా మారిపోయేది. మరికొన్ని రోజులు షూటింగ్ అలానే కంటిన్యూ చేసి ఉంటే చర్మం మీద లేయర్ మొత్తం పోయి నల్లబడిపోయేవాడు.
ప్రభాస్
బుజ్జిగాడు స్క్రిప్ట్ బ్యాంకాక్ లో రాస్తూ కూర్చున్నా. ఒక రోజు పొద్దున్నే ప్రభాష్ అక్కడికి వచ్చేశాడు. తనతో ముగ్గురు కుర్రాళ్లను తీసుకొచ్చాడు. రకరకాల వంటకాల్ని చేయించేవాడు. బాగా తినిపించేవాడు.
బాలకృష్ణ
పైసావసూల్ సినిమా షూటింగ్ సమయంలో తెల్లవారుజామున నాలుగున్నరకే యూనిట్ మొత్తాన్ని నిద్ర లేపేవారు. ఆయనకు దైవభక్తి చాలా ఎక్కువ. ఐ లవ్ బాలయ్య. ఆయనతో కూర్చొని మాట్లాడటం చాలా ఇష్టం. ఆయన చాలా గ్రేట్ మ్యాన్.
చిరంజీవి
ఆయనతో నాలుగు సార్లు సినిమా తీయాలని అనుకున్నాం. రెండుసార్లు మూవీకి సంబంధించిన పూజలు కూడా జరిగియా. కానీ.. అవేవీ వర్క్ వుట్ కాలేదు. ఆయనతో ఇప్పటికి సినిమా తీయాలని ఉంది.