Begin typing your search above and press return to search.

అందుకే ఛార్మి ఇష్టం -పూరి

By:  Tupaki Desk   |   23 April 2018 11:01 PM IST
అందుకే ఛార్మి ఇష్టం -పూరి
X
దర్శకుడు పూరి జగన్నాథ్ చేసే సినిమాలు గత కొంత కాలంగా ఊహించని విధంగా పరాజయాలు అవుతున్నాయి. ఎంత కష్టపడి తీసిన ఫలితం రాలేదు. అయితే పూరి చాలా కాలం తరువాత ఒక మంచి హిట్ కొట్టేలా కనిపిస్తున్నాడు. తన సొంత ప్రొడక్షన్ లోనే కొడుకు ఆకాష్ ని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా సినిమాని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవల ట్రైలర్ కూడా మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇకపోతే రీసెంట్ గా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. సినిమాకు సంబందించిన విషయాలని పూరి తనదైన శైలిలో వివరించారు. ముఖ్యంగా వర్కింగ్ ప్రొడ్యూసర్ ఛార్మిని ప్రశంసలతో ముంచెత్తారు. మైనెస్ డిగ్రీలలో షూటింగ్ చేస్తున్నపుడు ఛార్మి వ్యవహరించిన తీరు అద్భుతమని చెప్పారు. ప్రొడక్షన్ టీమ్ కు ఏం కావాలో అన్ని సమకూర్చి షూటింగ్ సజావుగా సాగడానికి కృషి చేసిందని అందుకే తనంటే ఇష్టమని పూరి తెలిపారు.

సినిమాను దిల్ రాజు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి పూరి స్పందిస్తూ.. దిల్ రాజు సినిమా రిలీజ్ చేస్తున్నారు అనేగన్ నాకు చాలా మంది ఫోన్ చేశారు. ఆయన నమ్మి రిలీజ్ చేస్తున్నారు అనగానే ఎలాంటి సమస్య ఉండదని చెప్పారు. అంతటి నమ్మకాన్ని ఆయన సంపాదించుకున్నారని తెలిపారు. అంతే కాకుండా చిత్ర యూనిట్ లో ఉన్న ప్రతి ఒక్కరు సినిమా కోసం చాలా కష్టపడ్డారని చెబుతూ.. మే 11న రిలీజ్ కానున్న ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుందని చెప్పారు.