Begin typing your search above and press return to search.
ఇది నా సెకండ్ ఇన్నింగ్స్ .. 'లైగర్' నా ఫస్టు మూవీ: పూరి
By: Tupaki Desk | 20 Aug 2022 8:08 AM GMTటాలీవుడ్ దర్శకులలో పూరి జగన్నాథ్ ట్రాక్ సెపరేటు. చకచకా కథలు అల్లేయడం .. అంతే స్పీడ్ గా వాటిని సెట్ పైకి తీసుకుని వెళ్లడం .. అక్కడి నుంచి తెరపైకి తీసుకు రావడం చేస్తుంటాడు. ఎంత పెద్డ స్టార్ తో సినిమా అయినా ఆయన 6 నెలల్లోనే థియేటర్ కి తీసుకుని వచ్చేస్తాడు. అలాంటిది 'లైగర్' సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకుని రావడానికి మాత్రం దాదాపు మూడేళ్లు పట్టింది. పాండమిక్ ప్రభావాన్ని పక్కకి పెట్టినా, ఆయన తీసుకున్న సమయం ఎక్కువే. తాజా ఇంటర్వ్యూలో చార్మీ నుంచి ఆయనకి ఇదే ప్రశ్న ఎదురైంది.
అందుకు పూరి స్పందిస్తూ .. "పాండమిక్ కి ముందు నా సినిమాలు వేరు .. పాండమిక్ తరువాత నా సినిమాలు వేరు అని డిసైడ్ అయ్యాను. అలా వచ్చిన నా ఫస్టు మూవీగా 'లైగర్' ను భావిస్తున్నాను.
ఒక రకంగా ఇది నా ఫస్టు మూవీ .. నా సెకండ్ ఇన్నింగ్స్ అనుకోవచ్చు. ఇక నుంచి చేసే సినిమాలన్నీ టైమ్ తీసుకుని .. ఫుల్ ఎఫర్ట్ పెట్టి చేస్తాను. ఇంతకుముందు కొన్ని ప్రయోగాలను గబగబా చేసేశాను. ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. పది సినిమాలు చేసినా .. లైఫ్ టైమ్ గుర్తుండిపోయేవి చేస్తాను" అన్నాడు.
విజయ్ దేవరకొండ మాట్లాడుతూ .. "లైఫ్ లో చేస్తే పెద్ద సినిమా చేయాలి .. అది ఒక రేంజ్ లో షేక్ చేయాలి అనుకునేవాడిని. అదే ఆలోచనతో పూరిగారు ఉన్నారు. ఆయనను కలవడం వలన నేను అనుకున్నది నెరవేరబోతోందనే విషయం నాకు అర్థమైపోయింది. పూరిగారిపై గల నమ్మకమే ఆయనతో మరో సినిమా చేయడానికి కారణమైంది.
ఇక మొదటి నుంచి కూడా నేను సోషల్ మీడియాలో ఉండటానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు. అయితే ఎలాంటి నేపథ్యం లేకుండా వచ్చిన నన్ను ఆడియన్స్ ఎంతో ఆదరిస్తున్నారు. వాళ్లకి టచ్ లో ఉండటం కోసం నేను సోషల్ మీడియాలోకి వచ్చాను. ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారనేది తెలుసుకుంటూ ముందుకు వెళుతున్నాను.
నేను సినిమాల్లోకి వచ్చేటప్పుడే ఒకసారి కమిట్ అయితే ఏం చేయడానికైనా .. తెరపై ఎలా కనిపించడానికైనా వెనుకాడవద్దని నిర్ణయించుకున్నాను. పూరి గారు నాకు కథ చెప్పినప్పుడే 'లైగర్' లుక్ ఎలా ఉండాలనేది నాకు అర్థమారిపోయింది. పూరి గారు అంత కష్టపడి ఆ పాత్రను రాస్తే, నా లేజీనెస్ వలన దానిని పాడు చేయకూడదు. ఆ పాత్రలో మజా రావాలంటే కండలు పెంచాల్సిందే .. లేదంటే మజా రాదు. కంటెంట్ ను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లడానికి నేను కష్టపడవలసిందే. ఇప్పుడు కాకపోతే ఇలాంటివి ఇంకా ఎప్పుడు చేయగలుగుతామని రంగంలోకి దిగిపోయాను" అంటూ చెప్పుకొచ్చాడు.