Begin typing your search above and press return to search.
'లైగర్' ఆలోచన వెనుక బన్నీ ఉన్నాడు: పూరి
By: Tupaki Desk | 24 Aug 2022 12:30 PM GMTపూరి నుంచి రేపు థియేటర్లకు 'లైగర్' వస్తుండగా, ఆయనను సుకుమార్ ఇంటర్వ్యూ చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది. సుకుమార్ కీ .. పూరికి మధ్య జరిగిన సంభాషణలు చాలా విషయాలను జనంలోకి తీసుకుని వెళ్లేలా ఉన్నాయి. 'లైగర్' సినిమాకి సంబంధించిన ఆలోచన ఎక్కడ మొదలైంది? ఎలా పునాది పడింది? అనే సుకుమార్ ప్రశ్నకి పూరి స్పందించాడు. "చాలా కాలం క్రితం బన్నీ నాతో మాట్లాడుతూ .. 'హీరోకి ఏదైనా లోపం పెట్టేసి ఒక కథను రెడీ చేయవచ్చుగా' అని నాతో అన్నాడు. దాంతో 'నత్తి' ఉన్నట్టుగా హీరో పాత్రను డిజైన్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను.
ఇక మొదటి నుంచి కూడా నాకు మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో ఒక సినిమా చేయాలనే కోరిక బలంగా ఉండేది. అలా బాక్సింగ్ వైపుకు నా దృష్టి పోయింది. బాక్సర్ పాత్రకి 'నత్తి పెట్టేశాను. అలా ఈ ఆలోచన వెనుక బన్నీ ఉన్నాడు. ఇక జీవితంలో ఎలాంటి సంరక్షణ లేకుండా పెరుగినవాళ్లు చాలా స్ట్రాంగ్ గా ఉంటారు. అలాంటి ఒక నేపథ్యం నుంచి వచ్చిన హీరోలే నా సినిమాల్లో ఎక్కువగా కనిపిస్తుంటారు. 'లైగర్'లో హీరోకి నత్తి ఉన్నప్పటికీ అతని పాత్ర చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆయనకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది.
'విజయ్ దేవరకొండ 'నత్తి' పాత్రను ఎలా చేస్తాడో చూడాలి .. అతను ఆ పాత్రను బాగా చేస్తే సినిమా హిట్టే' అని రమ్యకృష్ణగారు అన్నారు. ఫస్టు రోజున కెమెరా వెనుక నుంచి విజయ్ పెర్ఫార్మెన్స్ చూసి ఆమెనే క్లాప్స్ కొట్టారు. ఇక కథ ఏదైనా దానిని ఎంత సింపుల్ గా చెప్పాలా అనేది చూస్తాను .. ఎందుకంటే సినిమా అనేది సామాన్యులకు కూడా అర్థం కావాలి.
నేను డైరెక్టర్ ను కావడానికి ముందు నుంచే రాజమౌళిగారితో స్నేహం ఉండేది. అప్పట్లోనే విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద రైటర్. అప్పట్లో ఆయనతో మాట్లాడాలంటేనే చాలా భయంగా ఉండేది. అలాంటి ఆయన తన ఫోన్లో 'వాల్ పేపర్' గా నా ఇమేజ్ పెట్టుకోవడమే నాకు దక్కిన పెద్ద అవార్డుగా భావిస్తున్నాను.
ఇక ఇంతవరకూ నేను చాలా ఫాస్టుగా సినిమాలు చేస్తూ వచ్చాను. ఇకపై సుకుమార్ మాదిరిగానే సమయం తీసుకుని చేయాలనుకుంటున్నాను. 'పుష్ప' సినిమా .. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ నాకు బాగా నచ్చింది" అంటూ పూరి చెప్పుకొచ్చాడు.
అందుకు సమాధానంగా సుకుమార్ మాట్లాడుతూ .. " ముందుగా ఈ సినిమాను ఒక భాగంగానే తీయాలనుకున్నాను. ఆ తరువాత కథా పరిధి ఎక్కువగా ఉండటం వలన సెకండ్ పార్టు చేయాలనుకున్నాను. దాంతో ఫస్టు పార్టులో ఇంటర్వెల్ బ్యాంగ్ అనుకున్న సీన్ క్లైమాక్స్ కి వచ్చేసింది" అని చెప్పుకొచ్చాడు.