Begin typing your search above and press return to search.

తెరపై కొచ్చిన మహేష్ జనగణమన

By:  Tupaki Desk   |   5 March 2019 9:38 AM GMT
తెరపై కొచ్చిన మహేష్ జనగణమన
X
ఒకప్పుడు హీరోలకు అభిమానుల అభిప్రాయం తెలుసుకోవాలి అంటే ఒకటి వాళ్ళను వ్యక్తిగతంగా కలుసుకోవాలి లేదా పత్రికల ద్వారానో లేదా టీవీ రూపంలో మాట్లాడేది చూడాలి. ఇప్పుడంత కష్టం లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని ఒకేసారి లక్షలాది ఫ్యాన్స్ ఆకాంక్షలు ఫీడ్ బ్యాకులు ఇట్టే క్షణాల్లో తెలిసిపోతున్నాయి. నిన్న సుకుమార్ తో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందన్న మెసేజ్ స్వయంగా మహేష్ ట్వీట్ చేశాక దానికి భారీ స్పందన దక్కింది.

కొందరు ఇలా జరగకుండా ఉండాల్సింది అంటే అధిక శాతం మాత్రం పోతే పోయింది ఎవరితో చేసినా బ్లాక్ బస్టర్ తగ్గకుండా చూసుకో అంటూ మహేష్ కు సలహాలు సూచనలు ఇచ్చేసారు. కాని విచిత్రంగా వీటిలో పూరి జగన్నాధ్ తీసిన పోకిరితో పాటు తీయాలనుకుని వదిలేసిన జనగణమన ప్రస్తావన రావడం విశేషం. ఎందుకంటారా మహేష్ రేంజ్ మాస్ సినిమా వచ్చి చాలా కాలం అవుతోంది

శ్రీమంతుడు-భరత్ అనే నేను లాంటి ఇండస్ట్రీ హిట్స్ ఉన్నప్పటికీ వాటిలో హీరో పాత్రలకు ఒక సాఫ్ట్ టచ్ ఉంటుంది. అదేమీ లేకుండా నుదుటికి కర్చీఫ్ కట్టుకుని ఊర మాస్ లుక్ లో కనిపించింది చివరిసారిగా పోకిరిలోనే. అచ్చంగా అలాంటి ఓ మసాలా సినిమా చేయమని ఈ సందర్భంగా ఫాన్స్ కోరుతున్నారు. దానికి పూరి జగన్నాధ్ బెస్ట్ ఛాయస్ అని వాళ్ళ మనసులో మాట. బిజినెస్ మెన్ లో క్లాస్ టచ్ ఉన్నప్పటికీ అందులో కూడా మాస్ కు మెచ్చే అంశాలు చాలా ఉన్నాయి. జనగణమనతో హ్యాట్రిక్ వస్తుంది అనుకుంటే అది ఆలోచన దశలోనే ఆగిపోయింది. ఇప్పుడేదో అభుమానులు అంటున్నారని కాదు కానీ పూరి ట్రాక్ రికార్డ్ కి ఓ రెండు బ్లాక్ బస్టర్స్ పడితే కానీ మహేష్ రేంజ్ హీరోల నుంచి పిలుపు రాదు.