Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసు: రెండున్నర గంటలకు పైగా సాగుతున్న పూరీ విచారణ..!
By: Tupaki Desk | 31 Aug 2021 8:46 AM GMTనాలుగేళ్ళ క్రితం టాలీవుడ్ లో సంచలనం రేపిన డ్రగ్స్ కేసు.. మళ్ళీ తెరపైకి వచ్చింది. అప్పట్లో తెలంగాణ ఎక్సైజ్ అధికారులు విచారించిన ఈ కేసులో ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కలుగజేసుకుంది. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి సినీ ప్రముఖులతో సహా 12 మందికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపధ్యంలో ఈరోజు (ఆగస్ట్ 31) డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ను విచారణకు రావాలని ఈడీ ఆదేశించగా.. నేడు మంగళవారం పూరీ ఈడీ ఎదురు హజరయ్యారు. తన చార్టెడ్ అకౌంట్ తో కలిసి హైదరాబాద్ లోని ఈడీ ఆఫీస్ కు వచ్చారు.
డ్రగ్స్ వ్యవహారాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలపై ఈడీ అధికారులు పూరి జగన్నాథ్ ను ప్రశ్నిస్తున్నారు. దాదాపు రెండున్నర గంటలకు పైగా పూరీ విచారణ కొనసాగుతోంది. చార్టెడ్ అకౌంట్ సహాయంతో ఈడీ అధికారుల ప్రశ్నలకు పూరీ సమాధానాలు ఇస్తున్నారని తెలుస్తోంది. బ్యాంక్, ఆన్లైన్ లావాదేవీల పై ఈడీ దృష్టి సారించిన ఈడీ అధికారులు.. మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణం వివరాలు సేకరిస్తున్నారు.
డైరెక్టర్ పూరి జగన్నాధ్ కు సంబంధించి 2015 నుండి 2021 వరకు బ్యాంక్ లావాదేవీలను ఈడీ కోరింది. పూరీ తన 3 బ్యాంకు ఖాతాల లావాదేవీల వివరాలను అందించారని సమాచారం. మిగతా 11 మందిని కూడా గత 6 సంవత్సరాల బ్యాంక్ లావాదేవీలను సమర్పించమని ఈడీ నోటీసులలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కాగా, అబ్కారీ శాఖ సిట్ అధికారుల నుండి వివరాలను సేకరించిన ఈడీ.. షెడ్యూల్ ప్రకారం విచారణకు హాజరు కావాలని సినీ ప్రముఖులను కోరింది.
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలిస్తోన్న ఈడీ.. ఈ 12 మందిని సాక్షులుగా మాత్రమే ప్రశ్నిస్తున్నారు. మనీలాండరింగ్ జరిగిందని రుజువైతే వీరిపై కేసులు నమోదు చేస్తుంది. రాబోయే రోజుల్లో చార్మీ కౌర్ - రానా దగ్గుపాటి - రకుల్ ప్రీత్ సింగ్ - రవితేజ - నవదీప్ - ముమైత్ ఖాన్ - తరుణ్ - నందు - తనీష్ - రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ లు ఈడీ ఎదుట హాజరు కానున్నారు.